Dunki Day 2 Collections భారీగా పడిపోయిన డంకీ కలెక్షన్లు.. షారుక్ మూవీ వసూళ్లు దయనీయంగా!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన డంకీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతున్నది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి రూపొందించిన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ దిశగా పరుగులుప పెడుతున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా 2వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
Recommended Video

డంకీ మూవీ బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 210 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సిన పరిస్థితిలో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఇక డంకీ సినిమాను ఇండియాలో 4 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 5000 వేల స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమాపై అన్ని వర్గాలు పెదవి విరచడంతో ఉత్తరాదిలో చాలా థియేటర్ల నుంచి సినిమాను ఎత్తివేశారు. హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఉదయం ఆటకు 20 శాతం, మ్యాట్నీలకు 25 శాతం, ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ లభించింది.
ఇక డంకీ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 30 కోట్ల షేర్, 35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక ఓవర్సీస్‌లో 23 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 58 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. జవాన్, పఠాన్ సినిమాలతో పోల్చుకొంటే ఈ సినిమా దారుణంగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక ప్రతీకూల పరిస్థితుల్లో బాక్సాఫీస్ యాత్రను కొనసాగిస్తున్న డంకీ సినిమా కలెక్షన్లు భారీగానే పడిపోయాయి. ఇండియా వైడ్‌గా ఈ సినిమా 20 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 82 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











