Dunki 4 Days Collections: ప్రభాస్‌ 2 షారూక్ 3.. ఇండియాలో ఏ హీరో కొట్టని రికార్డు.. ఏంటి అన్ని కోట్లా!

గతంలో కంటే ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది సీనియర్ హీరోలు సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుస హిట్లతో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకరు.

ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' మూవీలతో రచ్చ లేపిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు 'డంకీ' అనే సినిమాతో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఆదివారం ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. మరి 'డంకీ' మూవీ నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

Dunki Movie 4 Days Worldwide Box Office Collections.. Crosses Rs 100 Crore Net

ముచ్చటగా మూడోది డంకీ: సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'డంకీ'. రాజ్‌కుమార్ హిరాణీ తీసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ మ్యూజిక్‌ను అందించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రలు చేశారు.

Dunki Movie 4 Days Worldwide Box Office Collections.. Crosses Rs 100 Crore Net

షారూక్ మూవీ ప్రీ బిజినెస్: వరుస హిట్లతో దూసుకెళ్తున్న షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Dunki Movie 4 Days Worldwide Box Office Collections.. Crosses Rs 100 Crore Net

నాల్గో రోజు ఎంతొచ్చింది?: షారూక్ ఖాన్ హీరోగా నటించిన 'డంకీ' మూవీకి మొదటి రోజు అనుకున్నట్లుగా రెస్పాన్స్ రాలేదు. రెండో రోజు డౌన్ అయినా మూడు, నాలుగు రోజులు బాగా రాణించింది. ఫలితంగా ఫస్ట్ డే రూ. 29.20 కోట్లు, రెండో రోజు మాత్రం కేవలం రూ. 20.12 కోట్లు, మూడో రోజు రూ. 26 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక, నాలుగో రోజు ఏకంగా రూ. 31.50 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చినా రెస్పాన్స్ మాత్రం మోస్తరుగానే లభిస్తోంది. అలా ఓవర్సీస్‌లోనూ ఇది పెద్దగా రాణించడం లేదు. దీంతో 4 రోజుల్లో షారూక్ ఖాన్ చిత్రం 6 మిలియన్ డాలర్లు అంటే రూ. 49 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Dunki Movie 4 Days Worldwide Box Office Collections.. Crosses Rs 100 Crore Net

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో రూపొందిన 'డంకీ' మూవీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన విధంగా రాణించడం లేదు అనే చెప్పాలి. ఫలితంగాఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని 4 రోజుల్లో రూ. 106.43 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే, రూ. 190 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ అండ్ సందేశాత్మకంగా రూపొందిన 'డంకీ' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 4 రోజుల్లో ఇది రూ. 106 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 104 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

Dunki Movie 4 Days Worldwide Box Office Collections.. Crosses Rs 100 Crore Net

మూడు సెంచరీలతో రికార్డ్: 'డంకీ' మూవీకి నాలుగు రోజుల్లో రూ. 100 నెట్ వసూళ్లు లభించాయి. ఫలితంగా ఈ ఏడాది అతడు నటించిన 'పఠాన్', 'జవాన్', 'డంకీ' మూవీలు రిలీజ్ కాగా.. ఇవన్నీ రూ. 100 కోట్లు నెట్ కొట్టాయి. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియాన్ హీరోగా షారూక్ నిలిచాడు. ఇక, ఇదే సంవత్సరం ప్రభాస్ కూడా రెండు సార్లు వంద కోట్లు నెట్ కొట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X