»   » నైజాంలో ‘డిజె’ సంచలనం: డిజె హిట్ మూవీ అనడానికి ఇదే సాక్ష్యం

నైజాంలో ‘డిజె’ సంచలనం: డిజె హిట్ మూవీ అనడానికి ఇదే సాక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డిజె'. ఈ సినిమా బాక్సాఫీసు లెక్కలు హిట్టో హిట్టస్య హిట్టోభ్యహ అని ఢంకా భజాయిస్తున్నా.... సోషల్ మీడియాలో ఓ వర్గం మాత్రం ఈ చిత్రాన్ని ప్లాపో ప్లాపస్య ప్లాపోభ్యహ అంటూ ప్రచారం చేస్తోంది.

తమ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది మొర్రో అంటూ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అఫీషియల్ లెక్కలు చూపెడుతన్నా అన్నీ ఫేక్ వసూళ్లేనని, తిమ్మినిబమ్మి చేసి ప్లాపు సినిమాను హిట్ సినిమాగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి కారణం... ఈ సినిమాకు మొదట్లోనే రివ్యూల్లో చాలా పూర్‌ రేటింగ్ రావడం, మిక్డ్స్ టాక్ రావడమే.


ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా? ఎవరు ఏమనుకున్నా తమ సినిమా హిట్టయింది. ఇది మామూలు హిట్ కాదు... బ్లాక్ బస్టర్ హిట్టే అని, బాహుబలి తర్వాత రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్ర తమదే అని నిర్మాతలు అంటున్నారు.నైజాంలో భారీ వసూళ్లు

నైజాంలో భారీ వసూళ్లు

నైజాం ప్రాంతంలో రూ. 20 కోట్లు వ‌సూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా పెద్ద హిట్టయితేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ మధ్య కాలంలో బాహుబలి 2 తర్వాత దువ్వాడ జ‌గ‌న్నాథం మాత్రమే రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు.బన్నీ కెరీర్లోనే తొలిసారి

బన్నీ కెరీర్లోనే తొలిసారి

మొత్తం 13 రోజుల్లో నైజాంలో 20 కోట్లు వసూలయ్యాయి. బన్నీ కెరీర్లోనే తొలిసారి నైజాంలో రూ. 20 కోట్ల మార్కును అందుకున్నారు. హరీష్ శంకర్ గతంలో గబ్బర్ సింగ్ ద్వారా రూ. 20 కోట్ల మార్కను అందుకోగా, డిజె ఆయనకు రెండోది.రెస్పెక్ట్ లేదు, అందుకే ఈ దరిద్రమైన పరిస్థితి: అల్లు అర్జున్ ఫైర్

రెస్పెక్ట్ లేదు, అందుకే ఈ దరిద్రమైన పరిస్థితి: అల్లు అర్జున్ ఫైర్

డిజె సినిమాపై నెగెటివ్ రివ్యూలు రావడంపై అల్లు అర్జున్ తీవ్రంగా స్పందించారు. మన సినిమాపై మనవాళ్లకు రెస్పెక్ట్ లేదని, కమర్షియల్ సినిమా అంటే ఎవరికీ గౌరవం లేదని మండి పడ్డారు. రేటింగ్ ఇవ్వడానికి మీరెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


బన్ని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి.అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి చిరంజీవి ఎవరు?... ఫ్యాన్స్ ఫైర్!

అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి చిరంజీవి ఎవరు?... ఫ్యాన్స్ ఫైర్!

అల్లు అర్జున్‌ను మెగాస్టార్ అంటూ పేర్కొనడంపై చిరంజీవి అభిమానులు ఫైర్ అయ్యారు. బన్నీ మెగాస్టార్ అయితే చిరంజీవి ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.నోటిదూల: నిన్న పవన్ కళ్యాణ్ మీద... ఇప్పుడు అల్లు అర్జున్ మీద!

నోటిదూల: నిన్న పవన్ కళ్యాణ్ మీద... ఇప్పుడు అల్లు అర్జున్ మీద!

నోటిదూల ఉన్నోళ్లు ఉరికే కూర్చోలేరు, ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తే బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషీద్ ఖాన్. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసిన రషీద్ ఇపుడు అల్లు అర్జున్ ను తీవ్రంగా అవమానించాడు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
English summary
DJ Team Reveals Nizam Collections. They have issued a statement saying that the movie has collected a share of Rs 20 Cr in Nizam in just 13 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X