Eagle Day 4 Collections 50 కోట్లపై కన్నేసిన రవితేజ.. ఈగల్‌కి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ఈగల్. మాస్ మహారాజా రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. అవసరాల శ్రీనివాస్, నవదీప్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా 4 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఈగల్ సినిమా విషయానికి వస్తే.. రవితేజ, అనుపమ, కావ్య థాపర్ లాంటి టాప్ యాక్టర్లు, బెస్ట్ టెక్నిషియన్స్‌తో రూపొందించారు. వారి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఏపీ, నైజాంలో కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

ఈగిల్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లు, హిందీలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల వసూళ్లతో కలిపి ఈ చిత్రం మొత్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 5 కోట్ల రూపాయలు నికరంగా, హిందీలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయ కలిపి మొత్తంగా 6.5 కోట్లు వసూలు చేసింది. తొలి రెండు రోజుల్లోనే ఈ చిత్రం 15.5 కోట్లు రాబట్టింది.
ఈగల్ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం స్టడీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తెలుగులో 5 కోట్లు నికరంగా, హిందీలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 7 లక్షలు నికరంగా వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 21 కోట్ల నికరంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈగిల్ సినిమా నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే కావడంతో భారీగా వసూళ్లు తగ్గాయి. ఈ సినిమా నైజాం, ఏపీలో కలిపి 1.5 కోట్ల నికరంగా 2.5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక హిందీలో ఈ సినిమా 10 లక్షల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 34 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.
రవితేజ నటించిన ఈగిల్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 40 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











