Eagle Closing Collections ఈగిల్ హిట్టా? ఫట్టా? రవితేజ మూవీకి లాభమా? నష్టమా?

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్ తదితరులు నటించిన చిత్రం ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రంలో అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే...

ఈగల్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టెక్నిషియన్స్, ఫారీన్ లొకేషన్లలో షూట్ చేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను 70 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ క్రేజీగా జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 40 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఇక ఈ సినిమాకు మంచి అంచనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 700 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

 Eagle Telugu Movie Box Office Closing Collections Worldwide

ఈగల్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. మాస్ మహారాజా సినిమా కావడంతో టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ సాధించింది. అయితే తొలి వారాంతం తర్వాత భారీ కలెక్షన్లను నిలబెట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనే సందేహం కలిగింది. కానీ వీకెండ్స్‌లో నిలకడగా వసూళ్లను నమోదు చేయడం ఊరటగా మారింది.

ఈగిల్ సినిమా తొలి మూడు రోజులు గట్టిగానే కలెక్షన్లు రాబట్టడంతో తొలివారం భారీగా వసూళ్లను సాధించింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ వీక్ 22 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగులో 21 కోట్లు, హిందీలో 1 కోటి రూపాయల వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా రెండోవారంలో కేవలం 2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఇండియాలో 24 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది.

 Eagle Telugu Movie Box Office Closing Collections Worldwide

మాస్ మహరాజా నటించిన ఈగిల్ ఓవర్సీస్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 3.5 కోట్లు నమోదు చేసింది. అలాగే ఇండియాలో 28 కోట్ల గ్రాస్, 24 కోట్ల నికర వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 31.5 కోట్ల రూపాయలను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు సుమారుగా 8.5 కోట్ల రూపాయల దూరంలో నిలిచిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X