Eagle Collections ఈగిల్‌కు గ్రాండ్ ఓపెనింగ్స్.. రవితేజ కెరీర్‌లో హయ్యెస్ట్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించిన తాజా తెలుగు చిత్రం ఈగిల్. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి రూపొందించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సినిమా రేంజ్‌లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈగిల్ సినిమాను రూపొందించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది.

Eagle Telugu Movie Expected Box Office Collections worldwide

ఈగిల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలోని పలు ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు పలికాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలు మేర బిజినెస్ నమోదైంది. ఇక కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 2 కోట్లు కలిపి మొత్తంగా 22 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

ఈగిల్ సినిమాకు జరిగిన భారీ బిజినెస్ తగినట్టుగానే ఈ సినిమాను అత్యధిక థీయేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో మొత్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1000కిపైగా స్క్రీన్లలో విడుదల చేశారు.

ఈగిల్ సినిమా ఓవర్సీస్‌లో తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికా, కెనడాలో 65K, యూకే, ఐర్లాండ్‌లో 23k, ఆస్ట్రేలియాలో 8k, యూఏఈ, గల్ఫ్‌లో 250 డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు ఓవర్సీస్‌లో 3.9 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రవితేజ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Eagle Telugu Movie Expected Box Office Collections worldwide

ఇక ఈగిల్ మూవీ తెలుగు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలో భారీగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, నైజాంలో 4 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 9 కోట్ల నుంచి 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఈగిల్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ మూవీ ముందు ఓ రేంజ్‌ లక్ష్యం ఉంది. ఈ సినిమా 44 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా 23 కోట్ల నికర వసూళ్లు నికర కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. ఎన్ని రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X