Ee Nagaraniki Emaindi Re Release Collections: పోకిరి రికార్డ్ బ్రేక్.. టాప్ 5లో ఒకటిగా బెస్ట్ ఓపెనింగ్

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఊహించిన విధంగా "ఈ నగరానికి ఏమైంది" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2018 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా ఆ తర్వాత ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మీమ్స్ గట్టిగానే వస్తుంటాయి. అయితే రీ రిలీజ్ చేయగా ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే...

Ee Nagaraniki Emaindi Re Release Day 1 world wide box office Collections

మంచి టాక్ సొంతం చేసుకొని: టాలెంటెడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా అభినవ్ గోమటం, వెంకటేష్ కుకుమాను, సాయి సుశాంత్ రెడ్డి కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అతి తక్కువ బడ్జెట్లో నిర్మించారు. ఇక 2018 జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదట్లోనే మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకోలేదు.

Ee Nagaraniki Emaindi Re Release Day 1 world wide box office Collections

ఓటీటీ లోనే అద్భుతమైన రెస్పాన్స్: నిర్మాత సురేష్ బాబు స్ట్రాటజీ ప్రకారం ఈ సినిమా ఆ తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. అప్పట్లో ఈ సినిమాను కేవలం 2 కోట్లతోనే నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా టోటల్ గా 12 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఒక విధంగా ధియేటర్లో కంటే ఓటీటీ లోనే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Ee Nagaraniki Emaindi Re Release Day 1 world wide box office Collections

రీ రిలీజ్ కు సాలీడ్ రెస్పాన్స్: ఇక ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు పూర్తయినా కూడా ఇంకా అదే తరహాలో క్రేజ్ అయితే ఉంది. సినిమాను రీ రిలీజ్ చేయాలి అనే ఫ్యాన్స్ చాలాకాలంగా దర్శకుడుని సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఇక మొత్తానికి సురేష్ బాబు ఇటీవల సొంతంగా ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేశారు. అయితే 2018లో విడుదల చేసినప్పుడు కంటే కూడా ఈ సినిమా సెకండ్ టైమ్ రిలీజ్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ సందుకోవడం విశేషం.

ఆడిరిపోయేలా ఓపెనింగ్స్: ఈ నగరానికి ఏమైంది.. రీ రిలీజ్ మొదటి రోజు అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజం లో ఈ సినిమాకు మొత్తంగా 81 లక్షలు రాగా ఆంధ్ర, సీడెడ్ లో 88 లక్షలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 1.69 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Ee Nagaraniki Emaindi Re Release Day 1 world wide box office Collections

ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చాయంటే: అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా చూసుకుంటే 9 లక్షలు రాగా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.78 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. పోటీగా కొత్త సినిమాలు పవన్ తొలిప్రేమ ఉన్నా కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

రీ రిలీజ్ లో పోకిరి రికార్డ్ బ్రేక్: రీ రిలీజ్ అయిన సినిమాల మొదటి రోజు టాప్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒకసారి చేసుకుంటే.. వరల్డ్ వైడ్ గా ఖుషి 4.15 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా సింహాద్రి 4.01 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత జల్సా 3.20 కోట్లు ఒక్కడు 2.05 కోట్లు అందుకోగా వీటి తర్వాత 5వ స్థానంలో ఈ నగరానికి ఏమైంది 1.78 కోట్లతో కొనసాగుతోంది. ఇంతకుముందు పోకిరి 1.73 కోట్లతో 5వ స్థానంలో ఉండగా దాన్ని ఈ సినిమా బ్రేక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X