‘ఈగ’ మూవీ 2 వీక్స్ షేర్
రాజమౌళి దర్శకత్వం వచ్చిన 'ఈగ' చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నిన్నటితో రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏపీ కలెక్షన్ల(షేర్) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం : 10.25 కోట్లు
సీడెడ్ : 5.21 కోట్లు
నెల్లూరు : 1.08 కోట్లు
కృష్ణా : 1.83 కోట్లు
గుంటూరు : 2.15 కోట్లు
వైజాగ్ : 2.20 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.82 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.51 కోట్లు
ఏపీ టోటల్ షేర్ : 26.05 కోట్లు
కేవలం ఏపీలోనే ఈచిత్రం ఈ రేంజిలో కలెక్షన్ చేసిందంటే టోటల్‌గా భారీగా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా ఈచిత్రానికి కర్ణాటకలో, యూఎస్‌లో విపరీతమైన వసూళ్లు వస్తున్నాయి. అదే విధంగా తమిళనాడు, కేరళ, రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. నాని, సుదీప్, సమంత నటించిన ఈచిత్రం జూలై 6న విడుదలైంది. కీరవాణి సంగీతం అందించిన ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మించారు. సురేష్ బాబు సమర్పకులు.


Click it and Unblock the Notifications











