‘ఈగ’కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ :'ఈగ' సూపర్ హిట్,కలెక్షన్స్ లో మగధీరను దాటింది,గబ్బర్ సింగ్ ని బీట్ అవుట్ చేస్తోంది అంటూ మీడియా ఎంతగా ప్రచారం చేసినా వీకెండ్ లలో తప్ప కలెక్షన్స్ కనపడటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓ ప్రముఖ దిన పత్రిక విశ్లేషణ ప్రకారం 'ఈగ' ఓపినింగ్స్ అదరకొట్టినా,తర్వాత మీడియా హంగామేనే ఎక్కువ కలెక్షన్స్ తక్కువ. సురేష్ బాబు ఎంతలా కలెక్షన్స్ గురించి,అద్బుత విజయం అంటూ ఊదరకొట్టినా 'ఈగ'టార్గెట్ రీచ్ కాలేదని వినికిడి.
నిజానికి సినిమా రిలిజ్ విషయంలో ప్రచార శైలిని బట్టి రాజవౌళి మరియు నిర్మాతలు కాస్త ఆందోళన చెందినట్లే కనిపించిందని అందరూ గుర్తించారు. అలాగే మీడియాను బాగానే మ్యానేజ్ చేసినట్లుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కాస్తంత మంచి టాక్ రాగానే, మీడియా యావత్తూ, ఈగను తమ భుజాలపై మోసేయడం ప్రారంభించాయి. 'ఈగ' గురించి ఓ రేంజిలో చెపుతూ విజయయాత్రలు, కవర్ స్టోరీల వచ్చాయి.
అంతేగాక రాజమౌళి ఎన్నడూ లేనిది విపరీతంగా పబ్లిసిటీ కాంపైన్ చేసారు. ఇతర దేశాల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేస్తున్నాం అని చెప్పేసారు. అంతేగాక వందకోట్ల సినిమా అని, ఇప్పటికే యాభై దాటేసిందని మీడియా అండతో ప్రచారానికి తెర తీసారు. మరికొంతమంది అయితే విడుదలైన వారానికే రాజవౌళి వాటా పాతిక కోట్లు దాటిందని కూడా లెక్కలు చెప్పేసారు.
అయితే రాజవౌళి ఆయన తోటి నిర్మాతలు ఆ సినిమాను బి. సి. సెంటర్లలో ఎలా నిలబెట్టాలా అని తెగ ప్రచారం సాగించుకుంటూ వచ్చారు.మరో ప్రక్క ఈగ తరువాత ఏ సినిమాలు విడుదల కాకుండా కొంత గ్యాప్ వచ్చేలా చేసారు. దీనికి తోడు ఈగ తర్వాత వచ్చిన తూనిగ తూనీగ వంటి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఇంత జరిగినా ఈగ సినిమా మాత్రం ఇంకా టార్గెట్‌కు చేరలేదని తెలుస్తోంది. ముఫై కోట్ల దగ్గర దగ్గర ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా అన్ని రైట్స్ మొత్తం కలిపి బ్రేక్ ఈవెన్‌కు చేరిందని వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











