మహేష్, పవన్ రికార్డులు బ్రద్దలు కొట్టిన 'ఈగ'
రాజమౌళి తాజా చిత్రం ఈగ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తూన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు చిత్రాల రికార్డులను బ్రద్దలు కొడుతుందంటూ ఓ ఇంగ్లీష్ దిన పత్రిక కథనం ప్రచురించింది. వారు చెప్పేదాని ప్రకారం... ఓవర్ సీస్ లో ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్,మహేష్ దూకుడు చిత్రాలే రికార్డులు క్రియేట్ చేసి ఉన్నాయి. అక్కడ టాప్ గ్రాసింగ్ చిత్రాలుగా ఈ రెండూ నిలిచాయి. అయితే ఈ రెండింటినీ ఈగ దాటే అవకాసం ఉందని తేల్చి చెప్తున్నారు.
సినీ పండితుల అంచనా ప్రకారం 'ఈగ'జోరు ఇలాగే కొనసాగితే యుఎస్ లో ఇండస్ట్రీ హిట్లైన గబ్బర్ సింగ్,దూకుడు చిత్రాలు ను అధిగమించి కలెక్షన్స్ కురిపిస్తుంది. ఇప్పటికే 'ఈగ' 9,00,000$ కలెక్టు చేసింది. గబ్బర్ సింగ్ 9,60,000$ కలెక్టు చేస్తే దూకుడు ఒక మిలియన్ కలెక్టు చేసింది. వంద రోజు లు నాటికి ఈగ ఏ మేరకు కలెక్టు చేస్తుంది అన్న అంచనా ప్రకారం... రికార్డులు బ్రద్దులు కొట్టే అవకాసం ఉందని తేల్చి చెప్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ విన్నా రాజమౌళి తాజా చిత్రం ఈగ గురించే చర్చలు. హీరో లేకుండా కేవలం ఈగ ను పెట్టి హిట్ కొట్టిన రాజమౌళిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంకు సీక్వెల్ తీస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రాజమౌళి ఈ చిత్రం సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విజయ యాత్రల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ..చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, సాయి కొర్రపాటి ఇద్దరూ కూడా ఈ సీక్వెల్ విషయమై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడే తీస్తారా లేక ప్రభాస్ చిత్రం అనంతరం తీస్తారా అన్నది చెప్పలేదు.
రాజమౌళి తాజా చిత్రం ఈగ రెండు వారాల క్రితం రిలీజైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మొన్న సక్సెస్ టూర్ ని చేసారు. ఇక ఈగ సక్సెస్ ని నిర్మాత సురేష్ బాబు,దర్శకుడు రాజమౌళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ బాబు తాను బాగా ప్రౌడ్ ఫీలవుతున్నారని చెప్తున్నారు. తెలుగు మీడియా కానీ,కన్నడ మీడియా కానీ, తమిళ మీడియా కానీ,నార్త్ ఇండియా మీడియా కానీ అన్ని చోట్లా ఇనానమస్ గా సినిమాని మనం ప్రమోట్ చేయాలి. ఈ సినిమాని అందరికీ తెలియాలి. మాగ్జిమం మెంబర్ ఆఫ్ జనాలు చూడాలి అనే ఒక కంకణం కట్టుకున్నట్లుగా ప్రమోట్ చేసారండీ..ఒక కొత్త కథ వస్తోంది. ప్రతీసారి మన ఇండియాలో కొత్త కథలు రావటం లేదు. కొత్త సినిమాలు రావటం లేదు..ఒక వెరైటి సినిమాలు రావటం లేదు...అనే రకరకాల కామెంట్స్ కు ఆన్సర్ గా ఈ సినిమా ని ఫీలయ్యారు అనుకుంటున్నాను. అలా ఫీలై ప్రమోట్ చేసారండీ...ఆయాం రియల్లీ వెరీ ధాంక్ ఫుల్ ..రేపు,ఎల్లుండి ఒక చిన్న మినీ టూర్ వేస్తున్నాం అన్నారు రాజమౌళి.
ఈగ తెలుగులోనే కాక, తమిళ, మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి,త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ఇక నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఓ సినిమాని 3D లోకి మార్చి రిలీజ్ చేయటం అంటే కష్టం. ఎందుకంటే 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట.


Click it and Unblock the Notifications











