రాజమౌళి ఈగ ఫస్ట్ లుక్ ఇదే
ఇక ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఇక 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications












