'ఈగ' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

By Srikanya

రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' ఆడియోని మార్చి 22న విడుదల చేయటానికి ఖరారు చేసారు. కీరవాణి స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు లాగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే కొంత ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తై పోయింది. ఇక ఈ చిత్రాన్ని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు రాజమౌళి క్లారిఫై చేసారు.మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు. ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు, తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము.నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలింగ్వల్. ఇక కన్నడ,హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము.ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ వేసవిలో విడుదల చేస్తాము అన్నారు.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X