శాటిలైట్ రైట్స్ లోనూ 'ఈగ' రికార్డు
రాజమౌళి తాజా చిత్రం ఈగ శాటిలైట్ రైట్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ నాలుగు కోట్ల ముఫ్లై లక్షలు వరకూ పలికిందని సమచారం. మా టీవీ వారు ఈ చిత్రాన్ని విపరీతమైన పోటీలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ ఈగ శాటిలైట్ రైట్స్ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు పలకి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో ఈ చిత్రం నిర్మాతలు మంచి ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే మొదటివారం ఈగ పద్దెనిమిది కోట్లు పై చిలుకు వసూలు చేసిందని అనధికార అంచనా. ఇనానమస్ గా హిట్ టాక్ రావటం సినిమాకు ప్లస్ అయ్యింది.
ఇక ఈగ సక్సెస్ ని నిర్మాత సురేష్ బాబు,దర్శకుడు రాజమౌళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ బాబు తాను బాగా ప్రౌడ్ ఫీలవుతున్నారని చెప్తున్నారు. రాజమౌళి ఈ సక్సెస్ విషయమై మాట్లాడుతూ...తెలుగు మీడియా కానీ,కన్నడ మీడియా కానీ, తమిళ మీడియా కానీ,నార్త్ ఇండియా మీడియా కానీ అన్ని చోట్లా ఇనానమస్ గా సినిమాని మనం ప్రమోట్ చేయాలి. ఈ సినిమాని అందరికీ తెలియాలి. మాగ్జిమం మెంబర్ ఆఫ్ జనాలు చూడాలి అనే ఒక కంకణం కట్టుకున్నట్లుగా ప్రమోట్ చేసారండీ అన్నారు.
అలాగే ఒక కొత్త కథ వస్తోంది. ప్రతీసారి మన ఇండియాలో కొత్త కథలు రావటం లేదు. కొత్త సినిమాలు రావటం లేదు..ఒక వెరైటి సినిమాలు రావటం లేదు...అనే రకరకాల కామెంట్స్ కు ఆన్సర్ గా ఈ సినిమా ని ఫీలయ్యారు అనుకుంటున్నాను. అలా ఫీలై ప్రమోట్ చేసారండీ...ఆయాం రియల్లీ వెరీ ధాంక్ ఫుల్ అన్నారు రాజమౌళి. మరో ప్రక్క ఈ చిత్రం త్రీడీ వెర్షన్ రెడీ అవుతోంది. సీక్వెల్ కు కూడా ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి చెప్తున్నారు.
ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి,త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. ఈగ హిందీ వెర్షన్ టైటిల్ మక్కి అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ లో విడుదల కాబోయే ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ,మళయాళం, హిందీ లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. ప్రస్తుతం ఎక్కడ విన్నా రాజమౌళి తాజా చిత్రం ఈగ గురించే చర్చలు. హీరో లేకుండా కేవలం ఈగ ను పెట్టి హిట్ కొట్టిన రాజమౌళిని అందరూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











