Ek Din Movie Box Office: ఏక్ దిన్ హిట్టా? ఫట్టా? సాయి పల్లవి మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?
సౌత్ ఇండియన్ సినిమా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తొలిసారి హిందీ సినిమా రంగంలోకి అడుగుపెడుతూ నటించిన చిత్రం ఏక్ దిన్. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శక నిర్మాత మన్సూర్ ఆలీ ఖాన్, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్, అపర్ణ పండిట్ నిర్మించారు. వన్ డే అనే థాయి సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కునాల్ కపూర్, కెవిన్ దావే తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మనోజ్ లోబో సినిమాటోగ్రఫిని, బల్లూ సలూజా ఎడిటింగ్, రామ్ సంపత్ మ్యూజిక్ విభాగాలను పర్యవేక్షించారు. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే డీటైల్స్‌లోకి వెళితే..

ఏక్ దిన్ చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. సాయిపల్లవి మినహాయించి స్టార్ పవర్ పెద్దగా లేకపోయినప్పటికీ.. ప్రొడక్షన్స్ పరంగా ఈ సినిమాకు భారీగా ఖర్చు చేశారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 85 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 30 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సాయిపల్లవి సినిమాకు దక్షిణాదిలోను, ఉత్తరాదిలోను మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఆడియెన్స్‌ను ఈ సినిమా భారీగా థియేటర్‌కు రప్పించలేకపోవడంతో కలెక్షన్లు నామమాత్రంగానే నమోదు అయ్యాయి. ఈ సినిమాను దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 650 లోకేషన్లలో సుమారుగా 2000 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా తొలి రోజు 1.25 కోట్ల నెట్, 2 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం తొలి వారాంతం శనివారం కూడా బాక్సాఫీస్ వద్ద కోలుకొన్నట్టు కనిపించడం లేదు. ఈ చిత్రం యావరేజ్ స్థాయిలో కూడా వసూళ్లను సాధించడం లేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం రెండో రోజున కూడా 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ రిపోర్ట్ కూడా అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తున్నది. దాంతో రెండు రోజుల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
ఏక్ దిన్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద రానున్న రోజుల్లో మ్యాజిక్ జరుగాల్సిందే. ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేస్తే గానీ లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మూవీ రానున్న రోజుల్లో పుంజుకొంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications