Ekka Day 2 Box Office: ఎక్కా మూవీ బాక్సాఫీస్ జోష్.. యువ రాజ్‌కుమార్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

కన్నడ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ఎక్కా. సంజనా ఆనంద్, సంపద హీరోయిన్లుగా నటించారు. రోహిత్ పడకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్ శెట్టి, శృతి, సాధు కోకిల, పూర్ణ చంద్ర మైసూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగీ జీ రాజ్ నిర్మించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి, దీపు ఎస్ కుమార్ ఎఢిటర్‌గా వ్యవహరించారు. జూలై 18వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఇక ఎక్కా సినిమాను మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు కమర్షియల్ హంగులతో భారీగా తెరకెక్కించారు. సెట్స్, క్రేజీ లొకేషన్లలో షూట్ చేశారు. కథ డిమాండ్ మేరకు క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అంతేకాకుండా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో రూపొందించారు. నాన్ థియేట్రికల్‌గా భారీగానే ఆదాయాన్ని రాబట్టింది. థియేట్రికల్‌గా వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సెట్ చేశారు.

Ekka Movie Day 2 Collections

ఎక్కా సినిమా కన్నడలో యువ రాజ్‌కుమార్ కెరీర్‌లో గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు కన్నడలో 1.7 కోట్ల రూపాయలు, ఏపీ, తెలంగాణలో 20 లక్షలు, తమిళనాడులో 10 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు 2.2 కోట్లు నెట్, 2.5 కోట్ల గ్రాస్ ఇండియాలో రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా తొలి రోజు కంటే అధికంగా కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఎక్కా సినిమా రెండో రోజున కన్నడలో 1.8 కోట్ల రూపాయలు, ఏపీ, నైజాంలో 20 లక్షలు, తమిళనాడులో 15 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా రెండో రోజు 2.35 కోట్ల నెట్, 2.7 కోట్ల గ్రాస్ రూపాయలు వసూలు చేస్తుందనే అంచనా ట్రేడ్ వర్గాల్లో ఉంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 5.2 కోట్ల రూపాయలు మేర కలెక్షన్లు నమోదు చేస్తుందని పేర్కొన్నారు. ఎక్కా సినిమాకు ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గానే రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ వెల్లడించడం లేదు. ఓవర్సీస్ కలెక్షన్లతో అదనంగా ఈ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 20 కోట్ల షేర్.. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం జోష్ చూస్తే.. థియేట్రికల్‌గా లాభాల జోన్‌లోకి వస్తుందా? అనే సందేహం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల వేగం పెంచితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వారం సినిమాకు బాక్సాఫీస్ రిపోర్టు కీలకంగా మారనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X