Emergency Closing Collections: ఎమర్జెన్సీ మూవీ హిట్టా? ఫట్టా? కంగన ఎంత లాభం? ఎంత నష్టం?

హిందీ సినిమా రంగంలో పాపులర్ నిర్మాణ సంస్థలు మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై జీ స్టూడియోస్, కంగన రనౌత్, రేణు పిట్టి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. జనవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎమర్జెన్సీ సినిమాలో కంగన రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. అటల్ బీహారి వాజ్‌పేయ్‌గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షాగా మిలింద్ సోమన్, తన అంతరంగీకురాలు పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరీ, మురార్జీ దేశాయ్‌గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

Emergency Box Office Closing Collections Worldwide Kangana Ranaut s Movie not impressive at GBOC

ఎమర్జెన్సీ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి బడ్జెట్ సుమారుగా 60 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందిరా గాంధీగా కంగన లుక్ ఆకట్టుకోవడం, అలాగే ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓ క్రేజీ ప్రాజెక్టుగా మారింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దేశంలో దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు.

ఎమర్జెన్సీ సినిమా తొలివారం గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో అంటే.. మొదటి రోజు 2.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.6 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.25 కోట్ల రూపాయలు, 4వ రోజు 1 కోటి రూపాయలు, 5వ రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 1 కోటి రూపాయలు, 7వ రోజు 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి 14.5 కోట్ల రూపాయలు నికరంగా వసూళ్లను సాధించింది.

ఇక రెండోవారంలో కంగన రనౌత్ నటించిన ఈ సినిమా భారీగా క్షీణించింది. రెండో శుక్రవారం 40 లక్షలు, శనివారం 85 లక్షలు, 10వ రోజు 1.15 కోట్లు వసూలు చేసింది. రెండో సోమవారం (11వ) రోజున 20 లక్షలు, అలాగే 12వ రోజున 20 లక్షల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 17.5 కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది. దాంతో దాదాపు ఈ సినిమా జర్నీ ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఓవర్సీస్‌లో కూడా ఎమర్జెన్సీ సినిమా ప్రభావం చూపలేపోయింది. ఈ చిత్రం సుమారుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల రూపాయలు నికరంగా, 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా దాదాపు 20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లవచ్చని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X