Emergency Collections: ఎమర్జెన్సీకి రికార్డు ఓపెనింగ్స్.. కంగన మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హిందీ సినిమా రంగంలో పాపులర్ నిర్మాణ సంస్థలు మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై జీ స్టూడియోస్, కంగన రనౌత్, రేణు పిట్టి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నటి గానే కాకుండా నిర్మాతగా దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. జనవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎమర్జెన్సీ సినిమాలో కంగన రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. అటల్ బీహారి వాజ్‌పేయ్‌గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షాగా మిలింద్ సోమన్, తన అంతరంగీకురాలు పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరీ, మురార్జీ దేశాయ్‌గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో ఎమర్జెన్సీ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో సన్నివేశాలకు తగినట్టుగా ఆర్ట్స్ వర్క్, మేకప్, సెట్స్ విషయంలో రాజీ పడుకుండా క్వాలిటీతో సినిమాను అందించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి బడ్జెట్ సుమారుగా 60 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇందిరా గాంధీగా కంగన లుక్ ఆకట్టుకోవడం, అలాగే ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓ క్రేజీ ప్రాజెక్టుగా మారింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దేశంలో దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. కంగన నటించిన ఈ సినిమా గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ఇండియాలో 2 కోట్ల రూపాయల షేర్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారుగా 50 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా సుమారుగా 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేస్తుందని పేర్కొన్నారు.
ఇక ఎమర్జెన్సీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఈ సినిమా 40 కోట్ల షేర్.. 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను థియేట్రికల్‌గా రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే వరుస ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్న కంగనకు ఈ సినిమా హిట్ అందిస్తుందా? లేదా అనేది కొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది.


Click it and Unblock the Notifications











