twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‘ఎందుకంటే ప్రేమంట’ఫైనల్ రిజల్ట్

    By Srikanya
    |

    రామ్, తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది. భారీ వ్యయంతో విడుదలైన ఈ చిత్రం భారీ ప్లాప్ ని మూట కట్టుకుంది. ఓపినింగ్స్ సైతం అంతంత మాత్రం తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ లలో ఫరవాలేదనుపించుకుంటోంది. సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబడితే ఓకే అనిపించుకోవచ్చు అంటున్నారు. అయితే ఆ వాతావరణం కనపడటం లేదు అని టాక్.

    ఇక ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేయనున్నారు. అయితే తమిళంలోనూ ఈ చిత్రం టాక్ స్పెడ్ అవటంతో ఎంతవరకూ అక్కడ నిలబడుతుందనేది సమస్య అని చెప్తున్నారు. ఈ చిత్రం మైనస్ లలో ఎంటర్టైన్మెంట్ లేకపోవటం మెయిన్ గా చెప్తున్నారు. ముఖ్యంగా ఆత్మ,దెయ్యం వంటి వాటితో ప్రేమ కథ ఏమిటి అని పెదవి విరవటం మైనస్ గా మారింది. ట్రేడ్ లో రెండు వారాల రన్ కూడా కష్టమే అని అంచనాలు వేస్తున్నారు.

    మరో ప్రక్క ఈ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అయిందని టాక్. కాస్ట్ కంట్రోల్ కమిటిలో దిల్ రాజు తో పాటు ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లిమిట్ లేని బడ్జెట్ లో నిర్మించటం ఎంతవరకూ సబబు అని కొందరు నిర్మాతలు స్రవంతి రవికిషోర్ ని ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. రామ్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న ఓపినింగ్స్,వసూల్లు చూసుకోకుండా అతని మార్కెట్ పెంచుదామనే తాపత్రయంలో ఈ చిత్రం చేసారని అదే దెబ్బ కొట్టిందని అంటున్నారు.

    దర్శకుడుగా కరుణాకరన్ సైతం విఫలమయ్యారు. జస్ట్ లైక్ హెవన్ అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఫ్రీమేక్ చేసి మరీ సరిగా తెరకెక్కించలేకపోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా కరుణాకరన్ హాలీవుడ్,కొరియా చిత్రాల స్పూర్తితో సినిమాలు చేసినా ఓకే అనిపించుకోవటంతో ఏ విమర్శలూ రాలేదు. ఇప్పుడందరూ ఈ చిత్రంపైనా,తమిళ దర్శకుల మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Ram and Tamannah starrer Endukante Premanta hit the screens on last friday with flop talk. Tamil director Karunakaran directed this film and Sravanthi Ravi kishore produced this with over cost.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X