twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ENEMY Day 3 collections : ఊహించని విధంగా కలెక్షన్లలో డ్రాప్..మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

    |

    విశాల్ తెలుగు వాడే అయినా తమిళ హీరోగా సత్తా చాటాడు. అనేక తెలుగు సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అలా విశాల్ ఆర్యతో కలిసి తాజాగా 'ఎనిమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. పెద్దన్న సినిమా కంటే మంచి కలెక్షన్స్ తొలి రోజున రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

    మంచి ప్రీ రిలీజ్ తో

    మంచి ప్రీ రిలీజ్ తో

    భారీ అంచనాలతో వచ్చిన 'ఎనిమీ' సినిమా తమిళ భాషతో పాటు తెలుగులో కూడా దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు సినిమా మీద అంచనాలు పెంచడంతో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 'నోటా' దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. 'వాడు వీడు' తర్వాత విశాల్, ఆర్య కలిసి నటించిన సినిమా కావడంతో 'ఎనిమీ' పై ఆసక్తి పెరిగింది.

    తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు కలెక్షన్లు ఇలా

    తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు కలెక్షన్లు ఇలా

    హీరో విశాల్, ఆర్య కలిసి నటించిన 'ఎనిమీ' సినిమా మూడో రోజు నిజాంలో 9 లక్షలు, సీడెడ్ 6 లక్షలు, ఉత్తరాంధ్ర 3 లక్షలు, ఈస్ట్ గోదావరి 2 లక్షలు, వెస్ట్ గోదావరి 2 లక్షలు, గుంటూరు 2 లక్షలు, కృష్ణా జిల్లా 2 లక్షలు, నెల్లూరు 1 లక్షలు అలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కలిపి 27 లక్షల షేర్ సాధించగా, 51 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. పెద్దన్న సినిమా లైన్ లో ఉండడంతో ఈ సినిమాకు కలెక్షన్లు రావనుకుంటే ఊహించిన దాని కంటే ఎక్కువ వచ్చాయి.

    మూడు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే

    మూడు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే

    ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే నిజాంలో 59 లక్షలు, సీడెడ్ 31 లక్షలు, ఉత్తరాంధ్ర 19 లక్షలు, ఈస్ట్ గోదావరి 14 లక్షలు, వెస్ట్ గోదావరి 11 లక్షలు, గుంటూరు 17 లక్షలు, కృష్ణా జిల్లా 10 లక్షలు, నెల్లూరు 8 లక్షలు అలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కలిపి కోటి 69 లక్షల షేర్ సాధించగా, రెండు కోట్ల 76 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.

    Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
    మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా

    మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా

    ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులలో కోటి 69 లక్షల షేర్ సాధించగా ఐదు కోట్ల టార్గెట్ కు ఇంకా 3.31 కోట్ల దూరంలో ఉంది. ఇక తమిళనాడులో ఈ సినిమా 7.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే మిగతా భారతదేశంలో 1.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సేస్ లో సినిమా 3.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 16.31 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా 8.2 కోట్ల షేర్ సాధించింది.

    English summary
    vishal arya starrer ENEMY Day 3 collections report is here
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X