రివ్యూలను, నెగిటివ్ టాక్‌ను ఎదురించిన ఎంత మంచివాడవురా.. 2 రోజుల్లో షాకింగ్ కలెక్షన్లు!
నందమూరి కల్యాణ్ రామ్, జాతీయ ఉత్తమ దర్శకుడు సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో ఆదిత్య మూవీస్ నిర్మాణ సారథ్యంలో శ్రీదేవి మూవీస్ సమర్పించిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజైంది. అయితే తొలి ఆట ముగిసే సమయానికి డివైడ్ టాక్ మూటగట్టుకొని కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నది. అంతేకాకుండా రివ్యూలు కూడా సానుకూలంగా లేకపోవడంతో యూనిట్‌ను కూడా కొంత ఇబ్బందికి గురిచేసింది. అయితే టాక్, రివ్యూలను ఎదురించి ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గత రెండు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ
గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఎంత మంచివాడవురా దూసుకెళ్తున్నది. తొలిరోజున రూ.1.21 షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు మొత్తంగా రూ.3.41 కోట్ల వసూళ్ల (షేర్)ను నమోదు చేసింది. ఇక శనివారం, ఆదివారం కూడా కలిసి రావడంతో కలెక్షన్లు పెరిగి అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. సినిమాకు సంక్రాంతి పండగ సెలవులు బాగా కలిసి వచ్చిందని, దర్శకుడు సతీష్ వేగేశ్న సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

2వ రోజు కలెక్ష్క్షన్లు
ఇక ఎంత మంచి వాడవురా చిత్రం 2వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.24 లక్షలు
సీడెడ్‌లో రూ.17 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.16 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.18.2 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 12.3 లక్షలు
గుంటూరులో రూ.16 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.13 లక్షలు
నెల్లూరులో రూ.4.2 లక్షలతో మొత్తంగా ఏపీ, తెలంగాణలో 1.21 కోట్ల షేర్ వసూలు చేసింది.

మొత్తంగా రెండు రోజుల కలెక్షన్లు
ఏపీ, తెలంగాణలో ఏరియా వారీగా 2 రోజుల కలెక్షన్లు
నైజాంలో రూ.90 లక్షలు
సీడెడ్‌లో రూ.55 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.35 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.48 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.32 లక్షలు
గుంటూరులో రూ.36 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.32 లక్షలు
నెల్లూరు జిల్లాలో రూ.13 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపి రూ.3.41 కోట్ల షేర్‌ను రాబట్టింది.
Recommended Video

ఓవర్సీస్‌తోపాటు ఓవరాల్‌గా
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంత మంచివాడవురా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.25 లక్షలు, ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.17 లక్షలు రాబట్టింది. దాంతో ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో మొత్తంగా ఈ చిత్రం రూ.3.83 కోట్ల షేర్, రూ.6.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలిసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉండటంతో వారాంతంలో డిస్టిబ్యూటర్లకు ఈ ఎంత మంచివాడవురా సినిమా ఆనందాన్ని పంచడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











