twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1' (నేనొక్కడినే) ఎపి రైట్స్ 55 కోట్లుకు కాదు...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒక పాట మినహా పూర్తైన మహేష్ తాజా చిత్రం '1' (నేనొక్కడినే). ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌ పంపణీ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్‌ చేజిక్కించుకుంది. ఇందుకుగానూ 55 కోట్ల చెల్లించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇందుకుగాను రూ.72 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడూ ఇందులోనే ఇన్ క్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ సినిమాలోని పాటల్ని ఈ నెల 19న విడుదల చేస్తారు. సినిమాను వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    ఇక చివరి పాట 11 డిసెంబర్ నుంచి ముంబైలో మొదలు కానుంది. ఆడియో లాంచ్ డిసెంబర్ 22న కానుంది. '1' (నేనొక్కడినే) చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 22 న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.

    14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

    '1' (నేనొక్కడినే) లో మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    EROS has brought Mahesh Babu starrer 1 Nenokkadine for a whooping Rs 72 Cr. Although producers are not forthcoming on this, we came to know that EROS bought it by paying this record price for a Telugu film. This includes the distribution and satellite rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X