Committee Kurrollu OTT Collections: ఓటీటీలో కమిటీ కుర్రోళ్ళకు దిమ్మతిరిగే కలెక్షన్లు.. ఎన్ని లక్షల వసూళ్లంటే?

ఒకప్పుడు సినిమాలు ఫలితాలు అంటే అవి వసూళ్లతో పాటుగా అవి రన్ అయ్యే రోజుల బట్టి కూడా ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారింది అంటే ఆ రోజుల రన్ కాస్తా పోయి ఆ సినిమా ఎలా ఉన్నా కూడా అది సాధించే వసూళ్లను బట్టి డిసైడ్ చేస్తున్నారు. సో ఆ సినిమా కొంత మందికి నచ్చకపోయినా వసూళ్లు వస్తే అది హిట్ లిస్ట్ లోకే వెళ్ళిపోతుంది.

ఇలా ట్రెండ్ మారిపోయిన తరుణంలో ఓటిటిల ప్రభావం కూడా పెరగడంతో సినిమాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కూడా మారుతూ వస్తుంది. కాగా ఇప్పుడు తెలుగులో మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. ఇన్ని రోజులు ఓ సినిమా రిలీజ్ అయ్యి డే 1 వసూళ్లు ఇంత అని మొదటి రోజే నంబర్స్ వస్తాయి. ఇది ఎప్పుడూ చూసేదే కానీ ఇప్పుడు కొత్తగా ఓటిటిలో కూడా కొత్త సినిమాలకి డే 1 వసూళ్లు అంటూ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.

etv win announced committee kurrollu day collections in ott

కాగా ఇటీవల ఓటిటిలో పలు చిత్రాలు ఒకే రోజు దాదాపు వచ్చేసాయి. మరి ఆ చిత్రాల్లో తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చిన "కమిటీ కుర్రోళ్ళు" కూడా ఒకటి. కాగా యువ హీరో హీరోయిన్స్ సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి, ఇంకా సాయి కుమార్ నటించగా మెగా డాటర్ నిహారిక ఈ సినిమాని నిర్మాణం వహించింది.

కాగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 12న ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చింది. దీనితో తాజాగా వారు ఒక ఊహించని పోస్ట్ పెట్టారు. సినిమా థియేటర్స్ లోనే కాకుండా ఇక నుంచి ఓటిటిలో కూడా భారీ రికార్డులు ఉంటాయి అంటూ పోస్ట్ చేశారు. ఇందులో షాకింగ్ గా ఈ సినిమా ఈటీవీ విన్ లో ఒక్క మొదటి రోజే 70 లక్షల 32 వేల 416 రూపాయలు సాధించింది అని రివీల్ చేశారు. ఇంత చిన్న సినిమాకి ఇది నిజంగా ఓ షాకింగ్ నెంబర్ అనే చెప్పాలి.

ఇలా ఓటిటిలో ఓ సినిమా మొదటి రోజు వసూళ్లు అనౌన్స్ చేయడం అనేది ఇదే మొదటి సారి అని చెప్పాలి. దీనితో కమిటీ కుర్రోళ్ళు ఓటిటిలో కూడా భారీ వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఈ కొత్త ట్రెండ్ మిగతా ఓటిటి ప్లాట్ ఫామ్ లు కూడా ఫాలో అయ్యి మిగతా సినిమాలకి కూడా రివీల్ చేస్తాయో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని యువ దర్శకుడు యదు వంశీ తెరకెక్కించగా గత ఆగస్టులో సినిమా రిలీజ్ కి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ లాభాలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో కూడా మన్ననలు పొందుతుంది.

కమిటీ కుర్రోళ్లు థియేట్రికల్‌గా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 8 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమా తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమాకే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X