Euphoria Day 1 Collections: యుఫోరియా తొలిరోజు కలెక్షన్స్... గుణశేఖర్ మూవీకి బాక్సాఫీస్ పరిస్ధితేంటీ?

ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో, భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్. వరుస ఫ్లాపుల నేపథ్యంలో రేసులో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో హిట్ కొట్టడమే లక్ష్యంగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రమే యుఫోరియా. చాలా రోజుల తర్వాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ఛావ్లా లీడ్ రోల్ పోషించారు. టైటిల్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యుఫోరియా చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో యుఫోరియా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

యుఫోరియా తారాగణం
గుణ టీమ్ వర్క్స్, హ్యాండ్‌మేడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణలు సంయుక్తంగా యుఫోరియా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ , సారా అర్జున్, నాజర్, రోహిత్, విగ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, ఆదాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గస్, ఆదర్శ్ బాలకృష్ణ, నవీన రెడ్డి, రవిప్రకాష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రవీణ్ కుమార్ పోతన్ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Euphoria Day 1 Expected Box Office Collections Worldwide Bhumika Chawla s film good start at GBOC

యదార్థ సంఘటనలతో యుఫోరియా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ అత్యాచార ఘటనతో పాటు కొన్ని యదార్ధ సంఘటన ఆధారంగా యుఫోరియా స్క్రిప్ట్‌ను గుణశేఖర్ తయారు చేసుకున్నారు. అత్యాచారాలతో పాటు డ్రగ్స్, పబ్ కల్చర్, నేటి యువత కలల, ఆశయాలు అన్నింటిని మేళవించి యూత్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉందని రివ్వూలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లతో యుఫోరియాపై హైప్ పెంచిన గుణశేఖర్.. ఆ తర్వాత వరుస ఇంటర్వ్యూలతో ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల ఆసక్తి తగ్గకుండా చూసుకున్నారు. భూమిక ఛావ్లా, సారా అర్జున్‌లు యుఫోరియా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారారు.

యుఫోరియా బడ్జెట్ & బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి యుఫోరియా సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మీడియం రేంజ్ సినిమాయే అయినప్పటికీ ఎక్కడా రాజీపడకుండా, నిర్మాణ విలువలు తగ్గకుండా ఈ సినిమాను నిర్మించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యుఫోరియా సినిమా లాభాల్లోకి రావాలంటే బడ్జెట్ ప్రకారం బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

యుఫోరియా తొలి రోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు గుణశేఖర్ క్రేజ్ కారణంగా యుఫోరియాపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. యువత నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో యుఫోరియా చిత్రానికి తొలిరోజున మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తంగా భూమిక ఛావ్లా మూవీకి తొలి రోజున వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X