Euphoria Day 2 Collections: యుఫోరియా బాక్సాఫీస్ కలెక్షన్స్... గుణశేఖర్ మూవీకి రెండ్రోజుల్లో ఎన్ని కోట్లంటే?
వరుస ఫ్లాపుల్లో ఉన్న సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్, సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా కలిసి వర్క్ చేసిన సినిమా యుఫోరియా. భారీ బడ్జెట్‌ల జోలికి పోకుండా మీడియం రేంజ్ సినిమాలతో తాను అనుకున్నది చెప్పాలని గుణశేఖర్ భావిస్తున్నారు. సొసైటీలో జరుగుతున్న అంశాలే ఇతివృత్తంగా గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. యుఫోరియా చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో యుఫోరియా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
యుఫోరియా తారాగణం
గుణ టీమ్ వర్క్స్, హ్యాండ్‌మేడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణలు సంయుక్తంగా యుఫోరియా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ , సారా అర్జున్, నాజర్, రోహిత్, విగ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, ఆదాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గస్, ఆదర్శ్ బాలకృష్ణ, నవీన రెడ్డి, రవిప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రవీణ్ కుమార్ పోతన్ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

యుఫోరియా బడ్జెట్ & బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి యుఫోరియా సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎక్కడా రాజీపడకుండా, నిర్మాణ విలువలు తగ్గకుండా గుణశేఖర్ పర్యవేక్షణలో ఈ సినిమాను నిర్మించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యుఫోరియా సినిమా లాభాల్లోకి రావాలంటే బడ్జెట్ ప్రకారం బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
యుఫోరియా కలెక్షన్స్
ట్రేడ్ పండితుల నివేదికల ప్రకారం.. యుఫోరియా భారీగా వసూలు చేస్తోంది. ఈ శుక్రవారం ఒకే రోజు ఆరు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ యుఫోరియా తన మార్క్ చూపిస్తోంది. గుణశేఖర్ మార్క్ టేకింగ్, భూమిక చావ్లా నటన, సారా అర్జున్ అందాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు యూత్ ఫిదా అవుతోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో యుఫోరియా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది.
యుఫోరియాకు రెండ్రోజుల్లో ఎంతంటే?
ఫిబ్రవరి లాంటి డ్రై సీజన్‌లోనూ యుఫోరియా తన మార్క్ చూపిస్తోంది. రెండో రోజైన శనివారం ఈ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యూపెన్సీ రిజిస్టర్ అవుతోంది. సిటీ కల్చర్, పబ్, డ్రగ్స్ పిల్లల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో యుఫోరియాలో కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పెద్దల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రెండ్రోజుల్లో ఈ సినిమా 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడవ రోజైన ఆదివారం యుఫోరియా మరింత రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











