Don't Miss!
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘ఎవరు’ 11 డేస్ కలెక్షన్: సినిమా లాభాల్లోకి వెళ్లిందా?
అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి క్రిటిక్స్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
తాజాగా 'ఎవరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది. అయితే తొలివారాంతంతో పోలిస్తే రెండో వారాంతం కలెక్షన్స్ తగ్గాయి. ఆదివారం(11వ రోజు) వచ్చిన కలెక్షన్లతో ఈ మూవీ టోటల్ షేర్ రూ. 9.70 కోట్లకు రీచ్ అయింది.
ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 9.10 కోట్లకు అమ్మారు. టోటల్ షేర్ బ్రేక్ ఈవెన్ పాయింటును దాటడంతో నిర్మాతలు లాభాల్లోకి వచ్చారు. అన్ని ఏరయాల్లో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి రికవరీ అయింది.
ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాం రూ. 3.40 కోట్లు, సీడెడ్ రూ. 80 లక్షలు, గుంటూరు రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 52 లక్షలు, కృష్ణ రూ. 62 లక్షలు, వెస్ట్ 33 లక్షలు, నెల్లూరు రూ. 17 లక్షలు రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రూ. 70 లక్షలు, ఓవర్సీస్ రూ. 1.60 కోట్లు వసూలు చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్.