‘ఎవరు’ సాలిడ్ హిట్... 4 వీక్స్ కలెక్షన్ ఎంతంటే?

అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి క్రిటిక్స్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుంది. సాలిడ్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ టోటల్ రూ. 13.1 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Evaru movie 4 weeks collections

అడవి శేష్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 'సాహో' మూవీ ఆశించిన స్థాయిలో ప్రభంజనం సృష్టించక పోవడంతో 'ఎవరు' సినిమాకు కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు పెరిగాయి.

ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 9.10 కోట్లకు అమ్మారు. టోటల్ షేర్ బ్రేక్ ఈవెన్ పాయింటును దాటడంతో నిర్మాతలు లాభాల్లోకి వచ్చారు. అన్ని ఏరియాల్లో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి రికవరీ అయి లాభాలు పొందారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X