Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కలెక్షన్ రిపోర్ట్: ‘ఎవరు’ లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా ఎంత రావాలి?
అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి క్రిటిక్స్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది.
ఆదివారంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఫస్ట్ వీకెండ్(4 రోజులు) పూర్తి చేసుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు 75 శాతం పెట్టుబడి రికవరీ అయింది. తొలివారం పూర్తయ్యేలోపు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుతుందని, సెకండ్ వీక్ లాభాల్లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు.
'ఎవరు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 9.10 కోట్లకు అమ్మారు. తొలి 4 రోజుల్లో రూ. 6.97 కోట్లు షేర్ వసూలైంది. మరో రూ. 2.13 కోట్ల షేర్ వస్తే లాభాల బాటలోకి వెళ్లనుంది. ఏపీ, తెలంగాణ రైట్స్ రూ. 6.80 కోట్లకు అమ్మగా ఇప్పటికే రూ. 5.27 కోట్లు వచ్చేశాయి. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 60 లక్షలకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 50 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 1.70 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 1.20 కోట్లు రికవరీ అయ్యాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్.