twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎవరు’ కలెక్షన్స్ అదుర్స్: చిన్న సినిమా పెద్ద విజయం దిశగా..

    |

    అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి క్రిటిక్స్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది.

    ఉదయం ఆటకు జనం కాస్త పలుచగా ఉన్నా... బావుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో మధ్యహ్నం షో నుంచి జనంతాకిడి పెరిగింది. ఆగస్టు 15 హాలిడే కూడా తోడవటంతో సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    ఫస్ట్ డే షేర్, అడవి శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్

    ఫస్ట్ డే షేర్, అడవి శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్

    ‘ఎవరు' చిత్రం ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే మంచి వసూళ్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రూ. 1.65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. శేష్ హీరోగా నటించిన చిత్రాల్లో ఇదే తొలిరోజు హయ్యెస్ట్ షేర్. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు దైర్యంగా ఉన్నారు.

    గత రికార్డులు బద్దలు

    గత రికార్డులు బద్దలు

    అడవి శేష్ హీరోగా ఇంతకు ముందు వచ్చిన ‘గూఢచారి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈచిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ రూ. 62 లక్షలు మాత్రమే. అయితే ఈ రికార్డు ‘ఎవరు' తెడిచిపెట్టేయడమే కాదు... మూడు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    నైజాం రూ. 64 లక్షలు, సీడెడ్ రూ. 16 లక్షలు, ఉత్తరాంద్ర రూ. 21 లక్షలు, గుంటూరు రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 21 లక్షలు, కృష్ణ రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 10 లక్షలు, నెల్లూరు రూ. 5 లక్షలు వసూలు చేసింది.

    రైట్స్ ఎంతకు అమ్మారు?

    రైట్స్ ఎంతకు అమ్మారు?

    ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మారు. తొలి రోజు రూ. 1.65 కోట్లు రావడంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈ సారి ఆగస్టు 15(సెలవు) గురువారం రావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. సూపర్ పాజిటివ్ టాక్ తోడవ్వటంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఎవరు

    ఎవరు

    ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌.

    English summary
    Evaru movie collected a distributor share of 1.65 Cr in opening day. Evaru ovie ft. Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murali Sharma. Directed by Venkat Ramji. Music by Sricharan Pakala. Produced by Pearl V. Potluri, Param V. Potluri and Kavin Anne under PVP Cinema banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X