ఎవరు, రణరంగం ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్
Recommended Video
అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎవరు', శర్వానంద్ మూవీ 'రణరంగం' ఆగస్టు 15న పోటీపోటీగా విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలపై రిలీజ్ ముందు నుంచే మంచి అంచనాలు ఉండటంతో ఏ మూవీ పైచేయి సాధిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే విడుదల తర్వాత 'ఎవరు' సినిమాతో పోలిస్తే 'రణరంగం' కాస్త వెనకబడి ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కూడా శర్వానంద్ మూవీ అడవి శేష్ సినిమా కంటే వెనకబడే ఉండటం గమనార్హం. ఆదివారంతో ఈ రెండు చిత్రాలు ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకోవడంతో ఏ సినిమా హిట్టు, ఏ సినిమా ఫట్టు అనేది హాట్ టాపిక్ అయింది.

నైజాం ఏరియాలో విజేత ‘ఎవరు'
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఆదివారం ‘ఎవరు' నైజాంలో రూ. 60 లక్షల షేర్ వసూలు చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ నైజాం షేర్ రూ. 2.30 కోట్లకు రీచ్ అయింది. ఇదే నైజాం ఏరియాలో రణరంగం ఆదివారం రూ. 25 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో టోటల్ నైజాం షేర్ రూ. 1.94 కోట్లకు చేరుకుంది.

యూఎస్ఏలోనూ తిరుగులేని ‘ఎవరు'
ఇక యూఎస్ఏ మార్కెట్లో పరిస్థితి గమనిస్తే.... ‘ఎవరు' మూవీ సూపర్ వసూళ్లతో దూసుకెళుతుంటే, రణరంగం మాత్ర ఇక్కడ పూర్తిగా డీలా పడిపోయింది. ‘ఎవరు' ప్రీమియర్ షోల ద్వారా $ 61K వసూలు చేయగా... మొదటిరోజైన గురువారం $ 43K, శుక్రవారం $ 73K, శనివారం $ 105K రాబట్టింది. ఆదివారం వసూళ్లతో ‘ఎవరు' టోటల్ ఫస్ట్ వీకెండ్ యూఎస్ఏ వసూళ్లు $ 350K మార్కు అందుకుంది.

‘ఎవరు' చిత్రానికి అలా కలిసొచ్చింది
అడవిశేష్ నటించిన గత చిత్రాలు ‘క్షణం', ‘గూఢచారి' చిత్రాలు గతంలో కూడా యూఎస్ఏ మార్కెట్లో మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘ఎవరు'పై ముందు నుంచీ పాజిటివ్ బజ్ ఉంది. రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో క్రమక్రమంగా వసూళ్లు పెరిగాయి.

రణరంగం డీలా
అయితే ‘రణరంగం' మూవీ యూఎస్ఏలో మొదలవ్వడమే లో కలెక్షన్లతో మొదలైంది. డివైడ్ టాక్ రావడం, మిక్డ్స్ రివ్యూల కారణంగా ఈ చిత్రం వసూళ్లు రోజు రోజకూ తగ్గు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కేవలం $75 మాత్రమే రాబట్టింది. ఇక్కడ ఈ మూవీ కోలుకునే పరిస్థితి లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











