Pushpa 2 VS Baahubali 2: బాహుబలి 2 రికార్డును పుష్ప 2 కొట్లేలేదా? క్రేజీగా ప్రభాస్ ఫ్యాన్స్ లాజిక్!
మామూలుగా ఒకో భాషకి చెందిన సినీ పరిశ్రమలో ఓ సినిమా అన్ని రికార్డులు తిరగరాస్తే అది ఇండస్ట్రీ హిట్ గా పిలవబడుతుంది. కాగా ఆయా సినిమాలు అందుకునే వసూళ్ల ప్రకారం పలు చిత్రాల రన్ ని హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వీటికి మించి ఇండస్ట్రీ హిట్ గా చెబుతూ ఉంటారు. అయితే ఇది స్టేట్స్ నుంచి ఇండియా వైడ్ వరకు కూడా వెళ్ళింది.
కాగా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక్క రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న దాదాపు అని రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఏకైక సినిమా "బాహుబలి 2". పాన్ ఇండియా హీరో ప్రభాస్, ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కించిన ఈ సినిమాపై ఉన్న హైప్ అప్పట్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గత ఏడేళ్ల కితం వచ్చిన ఈ సినిమా తాలూకా లాంగ్ రన్ ని కొట్టడం ఏ సినిమా వల్ల కూడా కాలేదు.

కానీ దానిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాను నటించిన పుష్ప 2 తో కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. మైటీ బాహుబలి 2 ని క్రాస్ చేయడం ఒక బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అయినప్పటికీ మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్న సీక్వెల్స్ సినిమాల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికీ బాహుబలి సినిమాలే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా కనిపిస్తుంది. కాగా బాహుబలి 1 అప్పట్లో 650 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసింది.
పార్ట్ 2 మొత్తం 1810 కోట్ల ప్లస్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అంటే ఈ రెండు సినిమాలు కలిపి రఫ్ గా 2400 కోట్ల వసూళ్లు అందుకున్నాయి అనుకుందాం కానీ పుష్ప 2 తో బాహుబలి 2 ని బ్రేక్ చేసి ఉండొచ్చు కానీ సెపరేట్ ఫ్రాంచైజ్ గా మాత్రం బాహుబలి సెట్ చేసిన రికార్డులు బ్రేక్ చెయ్యలేకపోయింది అనే చెప్పాలి. పుష్ప పార్ట్ 2 ఎలా లేదన్నా లాంగ్ రన్ లో ఇంకో 100 కోట్లతో 1900 కోట్లు చేసింది అనుకున్నా పార్ట్ 1 కి 370 కోట్ల మేర మాత్రమే అప్పట్లో వచ్చాయి.

పుష్ప 1 వచ్చిన పరిస్థితులు కూడా వేరు కానీ ఇపుడు బాహుబలి 2 కొట్టేసాం కొత్త ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్న ఫ్యాన్స్ మాత్రా ఓవరాల్ రెండు సినిమాలు పరంగా చూసినట్టు అయితే ఇంకా బాహుబలి ని పుష్ప దాటలేదు. మరి పుష్ప 1 రిలీజ్ అప్పుడు పరిస్థితులు బాగోలేవు కదా అంటే.. పుష్ప 2 ని బాహుబలి 2 కంటే అత్యధిక థియేటర్స్ లో ఇంకా బాహుబలి 2 కంటే భారీ టికెట్ ధరలతో రిలీజ్ చేశారు. సో ఈ లాజిక్ కి సరిపోయింది. కానీ రెండు సినిమాల వసూళ్ల పరంగా మాత్రం ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి మాత్రమే లీడ్ లో ఉందని చెప్పి తీరాలి


Click it and Unblock the Notifications











