సినిమా చూసే దమ్ముందా?(ట్రేడ్ టాక్)

అలాగే నానాపటేకర్,అర్జున్,కాజల్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ తో ప్రముఖ దర్శకుడు రూపొందించిన రాణా సినిమా కూడా కలెక్షన్స్ లేమి పరిస్ధిని ఎదుర్కొంటోంది. మంచి సినిమా అని పేరు తెచ్చుకున్నా ఈ సినిమా ఎవరినీ ఆకర్షించలేకపోతోంది. ఇక గతవారం రిలీజైన ఇంద్రజిత్,మ్యావ్,కుబేరులు,అందమైన అబద్దం చిత్రాలు పూర్తి డిజాస్టర్ టాక్ తో భాక్సులు తిరిగి ఇంటికి చేరుకున్నాయి. మరో ప్రక్క దేవి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన బ్లేడ్ బాబ్జి యాభై రోజుల పండుగను ఈ వారంలో జరుపుకుని చిన్న చిత్రాలకు కాస్తంత ధైర్యాన్నిచ్చింది. ఇక నిన్న రిలీజైన నేనింతే..అధ్బుతమైన ఓపినింగ్స్ సంపాదించుకుంటే..చెడుగుడు అనే మరో చిత్రం రిలీజైన సంగతి కూడా ఎవరికీ తెలియలేదు.


Click it and Unblock the Notifications











