»   » సేఫ్ జోన్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’...బడ్జెట్, కలెక్షన్ వివాలు

సేఫ్ జోన్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’...బడ్జెట్, కలెక్షన్ వివాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

    హైదరాబాద్: ఓ వైపు సంక్రాంతి రేసులో బాలయ్య, నాగార్జున, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పోటీ పడుతూ, థియేటర్ల సమస్యను అధిగమించి విడుదలకు సిద్ధం అవడం అంటే ఒక రకంగా రిస్కే అని చెప్పొచ్చు. అయితే ‘ఎక్స్ ప్రెస్ రాజా' చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ వీటిని పెద్దగా లెక్క చేయలేదు.

    డిస్ట్రిబ్యూషన్ బ్యాగ్రౌండ్ నుండి రావడం, ఈ రంగంలో మంచి నెట్ వర్క్ ఉండటంతో పక్కా ప్లానింగుతో సినిమాను రిలీజ్ చేసారు. నైజాం ఏరియాలో దిల్ రాజుకు ఈ సినిమాను అప్పగించారు. డిసెంటర్ నెంబరాఫ్ థియేటర్స్ ను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాయి. సినిమా కూడా సక్సెస్ టాక్ రావడంతో లాభాలు మూటగట్టుకుంటున్నారు.


    ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ బావున్నాయి. ఆంధ్ర, తెలంగాణల్లో ఈ చిత్రం 180 థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకు రూ. 9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో ఇప్పటి వరకు రూ. 2 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రం కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్(పబ్లిసిటీ ఖర్చుతో కలిసి)తో తెరకెక్కింది.


    Express Raja collects Rs 9 cr worldwide

    అయితే థియేటర్ల సమస్య కారణంగా చిత్రాన్ని కర్ణాటక, తమిళనాడులో విడుదల చేయలేదు. అక్కడ ఈ చిత్రాన్ని జనవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఏపి, తెలంగాణలో కూడా జనవరి 22 నుండి 50 థియేటర్లు పెంచుతున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ వీక్ లో మంచి కలెక్షన్లు మరింత ఎక్కువగా రానున్నాయి.


    యూఎస్ఏలో ఈ చిత్రం 70 స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటి వరకు $285000 వసూలు చేసింది. రెండో వారం కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. విడుదల ముందు ఆశించిన స్థాయిలో రేటు పలకక పోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ కూడా అమ్మలేదు. గతంలో రన్ రాజా రన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ రావడంతో రూ. 4కోట్లకు అమ్ముడయింది. ఇపుడు ‘ఎక్స్ ఫ్రెస్ రాజా' విషయంలో కూడా మంచి రేటు పలుకుతుందని ఆశిస్తున్నారు. సినిమా మంచి వినోదాత్మకంగా ఉండటంతో పాటు పబ్లిసిటీ విషయంలో కూడా నిర్మాతలు బాగా ఖర్చు(రూ. కోటి) చేయడం కలిసొచ్చింది.

    English summary
    Express Raja has managed to a get a good talk and is getting good collections. This film is released in around 180 theaters in Andhra Pradesh and Telangana. And collected a gross of 9 crores worldwide so far. Express Raja has crossed a share of 2 crores in Nizam by the afternoon of 19 Jan. This film is made on a budget of 7 crores (including publicity).
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more