Extra Ordinary Man Collections నితిన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో యువ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మెన్. శ్రేష్ట మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రాజశేఖర్, రావు రమేష్, పవిత్రా లోకేష్, హైపర్ ఆది తదితరులు నటించారు. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఏ మేరకు వసూలు చేశాయి? అనే వివరాల్లోకి వెళితే..
ఎక్ట్రా ఆర్డినరీ మెన్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. నటీనటుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ సినిమాను 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ పాజిటివ్‌గా మారడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది.

ఎక్ట్రా ఆర్డినరీ మెన్ మూవీకి భారీ బజ్ క్రియేట్ కావడంతో బిజినెస్‌కు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను 8 కోట్ల రూపాయలకు, సీడెడ్ థియేట్రికల్ హక్కులు 3 కోట్ల రూపాయలకు, ఆంధ్రా హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏపీ, నైజాం హక్కులు 20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ బిజినెస్ హక్కులు 5 కోట్ల రూపాయలకు అమ్మారు. దాంతో ఈ సినిమా హక్కులు 27 కోట్ల రూపాయలు పలికింది.
ఎక్ట్రా ఆర్డినరీ మెన్ సినిమా రిలీజ్‌కు ముందు పాజిటివ్ టాక్ రావడంతో మూవీని నితిన్ కెరీర్‌లోనే అత్యథిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏపీ, నైజాంలో 450 స్క్రీన్లు, కర్ణాటక, ఓవర్సీస్‌లో కలుపుకొని 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ మోస్తారుగా జరిగింది.
ఎక్ట్రా ఆర్డినరీ మెన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సినిమాకు ఇండియాలో 1 కోటి రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా, ఓవర్సీస్‌లో 65 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 4 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్‌లో మరో రెండు కోట్ల రూపాయలు రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సినిమా తొలి రోజు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నితిన్ గత సినిమా మాచర్ల నియోజకవర్గం సినిమా 8.1 కోట్ల రూపాయలను తొలి రోజు వసూలు చేసింది.

ఎక్ట్రా ఆర్డినరీ మెన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 28 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లాభాల్లోకి చేరుకొనే లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 28 కోట్లు షేర్, 52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











