F1 3 Days Collections: 3 రోజుల్లో 1110 కోట్లు.. ఎఫ్1 సినిమాకు ఇండియాలో ఎన్ని కోట్లంటే?

హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా జోసెఫ్ కోసిన్‌స్కీ దర్వకత్వంలో రూపొందిన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా F1 (ఎఫ్1). ఫార్మూలా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ సౌజన్యంతో రూపొందిన ఈ సినిమాకు ఎహ్రెన్ క్రూజర్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు స్వయంగా బ్రాడ్ పిట్, జెరెమీ క్లీనర్, జెర్నీ బ్రూక్‌హైమర్, డేడ్ గార్డనర్ నిర్మాతలుగా మారారు. న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్, ప్రొఫెషనల్ గ్యాంబ్లర్‌గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

ఈ సినిమాను సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2580 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో డామ్సన్ ఐడ్రీస్, కెర్రీ కాండన్, తోబియాస్ మెంజీస్, విల్ మెర్రిక్, సారా నైల్స్, సైమన్ ఆష్లే తదితరులు నటించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను న్యూయార్క్ సిటీలోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జూన్ 16వ తేదీన ప్రీమియర్ షోను నిర్వహించారు. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

F1 The Movie 3 Days Collections

సన్నీ హేయెస్ (బ్రాడ్ పిట్) ఫార్మూలా వన్ కారు డ్రైవర్. 1990లో జరిగిన రేసింగ్ సందర్భంలో తీవ్రమైన ప్రమాదానికి గురైన ఆయన ఫార్మూలా వన్ రేసింగ్ నుంచి రిటైర్ అవుతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్‌గా మారుతాడు. అయితే రిటైర్మెంట్‌కు స్వస్తి చెప్పి తిరిగి అపెక్స్ గ్రాండ్ ప్రీ టీమ్‌లో పాల్గొనాలని ఆఫర్ లభిస్తుంది. ఆ రేసింగ్‌లో సన్నీ హేయస్ పాల్గొన్నాడా? ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయనేది ఈ సినిమా కథ.

ఇండియాలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. తొలి రోజు ఈ మూవీకి ఇండియా వైడ్ సుమారుగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ 5.2 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 40 లక్షలు, తెలుగు వెర్షన్‌కు 50 లక్షలు, తమిళ వెర్షన్‌కు 30 లక్షలు వసూలు అయ్యాయి. ఇక రెండో రోజు ఈ సినిమా 8 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 7 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 50 లక్షలు, తెలుగు వెర్షన్ 50 లక్షలు, తమిళ వెర్షన్ 30 లక్షలు వసూలు చేసింది. దాంతో 8.3 కోట్లు వసూలు చేసింది.

ఇక గత మూడు రోజుల్లో F1 The Movie నార్త్ అమెరికాలోను, ఇతర దేశాల్లోను భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 55 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 470 కోట్ల రూపాయలు, ఇతర దేశాల్లో 75 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 640 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా భారతీయ కరెన్సీలో 1110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మూడో రోజు ఆదివారం హాలీడే కావడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఈ చిత్రం ఇండియాలో గత రెండు రోజుల కంటే ఎక్కువగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం.. ఈ మూవీ సుమారుగా 8 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లు సాధించ వచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. దాంతో ఈ సినిమా ఇండియాలో 20 నుంచి 22 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X