F1 Box Office Collections: F1 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు.. బ్రాడ్‌పిట్ మూవీకి ఇండియాలో ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా జోసెఫ్ కోసిన్‌స్కీ దర్వకత్వంలో రూపొందిన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా F1 (ఎఫ్1). ఫార్మూలా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ సౌజన్యంతో రూపొందిన ఈ సినిమాకు ఎహ్రెన్ క్రూజర్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు స్వయంగా బ్రాడ్ పిట్, జెరెమీ క్లీనర్, జెర్నీ బ్రూక్‌హైమర్, డేడ్ గార్డనర్ నిర్మాతలుగా మారారు. న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్, ప్రొఫెషనల్ గ్యాంబ్లర్‌గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
ఈ సినిమాను సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2580 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో డామ్సన్ ఐడ్రీస్, కెర్రీ కాండన్, తోబియాస్ మెంజీస్, విల్ మెర్రిక్, సారా నైల్స్, సైమన్ ఆష్లే తదితరులు నటించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను న్యూయార్క్ సిటీలోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జూన్ 16వ తేదీన ప్రీమియర్ షోను నిర్వహించారు. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సన్నీ హేయెస్ (బ్రాడ్ పిట్) ఫార్మూలా వన్ కారు డ్రైవర్. 1990లో జరిగిన రేసింగ్ సందర్భంలో తీవ్రమైన ప్రమాదానికి గురైన ఆయన ఫార్మూలా వన్ రేసింగ్ నుంచి రిటైర్ అవుతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్‌గా మారుతాడు. అయితే రిటైర్మెంట్‌కు స్వస్తి చెప్పి తిరిగి అపెక్స్ గ్రాండ్ ప్రీ టీమ్‌లో పాల్గొనాలని ఆఫర్ లభిస్తుంది. ఆ రేసింగ్‌లో సన్నీ హేయస్ పాల్గొన్నాడా? ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయనేది ఈ సినిమా కథ.
ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ సినిమా గత 10 రోజులుగా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజే 5.5 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా రెండో వారంలో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా వారాంతాల్లో ఈ సినిమాకు మంచి స్పందన థియేటర్లలో వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు.
ఫార్మూలా 1 రేసర్‌గా బ్రాడ్‌పిట్ నటించిన ఈ సినిమా తొలి వారం ఇండియాలో అన్ని భాషల్లోను గట్టిగానే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ 32 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 3 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కన్నడలో ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి వారం ఇండియాలో 35.5 కోట్లు వసూలు చేసింది.
ఇక రెండోవారంలో కూడా అదే జోష్ కొనసాగించింది. ఈ సినిమా 10వ రోజున 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంగ్లీష్ వెర్షన్ 42 కోట్ల రూపాయలు, హిందీ 3.5 కోట్లు, తెలుగు 1.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, కన్నడలో 2 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ధాంతో ఈ సినిమా 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు, సాక్ నిల్క్ డేటా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో 50 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ ఓవర్సీస్‌లో 1250 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా భారీగా వసూళ్లను రాబడుతున్నది. బ్రాడ్ పిట్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ బాక్సాఫీస్ రికార్డుగా మిగులుతుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











