Don't Miss!
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వసూళ్ల జోరు.. అన్నిచోట్ల కనకవర్షమే..
సంక్రాంతి బరిలో దూకిన F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. గత రెండు రోజుల F2 కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో F2 మూవీకి బ్రహ్మండమైన వసూళ్లు సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తున్నది. తొలి రోజే ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో కలిపి రూ.7.2 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.13 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఆంధ్రా, నైజాంలో
గత రెండు రోజులుగా తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో F2 చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. తొలి రోజునే ఈ చిత్రం కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్రా, నైజాంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నట్టు సమాచారం.
యూఎస్ కలెక్షన్లు
అమెరికా బాక్సాఫీస్ వద్ద F2 చిత్రం హడావిడి చేస్తున్నది. గత రెండు రోజుల్లో ఈ చిత్రం అమెరికాలో సుమారు 8 లక్షల డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే దాదాపుగా రూ.5 కోట్లు వసూలు చేసింది. వారాంతం తర్వాత మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పండుగ సెలవుల్లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది.
వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్
F2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 34.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం హక్కులు రూ.9 కోట్లకు, సీడెడ్ రూ.5 కోట్లకు, మిగితా రాష్ట్రాల్లో రూ.2.25, ఆంధ్రాలోరూ.14 కోట్లు, ఓవర్సీస్లో రూ.4.25 కోట్లు మేర బిజినెస్ జరిగింది.