‘ఎఫ్ 2’.. 4 డేస్ కలెక్షన్, లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?
Recommended Video

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి నాటికి బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 4రోజులు పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టెనర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ. 20 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఈ పండక్కి ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు మొదట విడుదలవ్వగా... వాటికంటే ఆలస్యంగా 'ఎఫ్ 2' రిలీజ్ చేశారు. అయితే ఆ రెండు చిత్రాలకు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆదరణ లేక పోవడం.... 'ఎఫ్ 2' చిత్రానికి అద్భుతమైన స్పందన రావడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది.

4 రోజుల్లో 70 శాతం పెట్టుబడి రివకరీ
‘ఎఫ్ 2' చిత్రం కేవలం 4 రోజుల్లో రూ. 19.89 కోట్ల షేర్ వసూలు చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 70 శాతం రికవరీ అయింది. ఫస్ట్ వీక్ వంద శాతం రికవరీ అవ్వడంతో పాటు లాభాల బాటలోకి వెళుతుందని అంచనా.

లాభాలు రావాలంటే ఎంత?
‘ఎఫ్ 2' ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ రూ. 28 కోట్లకు అమ్మారు. 4 రోజుల్లో రూ. 19.89 కోట్ల షేర్ వసూలైంది. మరో 8 కోట్ల షేర్ రాబడితే ఈచిత్రం లాభాల బాటలోకి వెళ్లనుంది.

ఎఫ్ 2 ఏరియా వైజ్ కలెక్షన్
నైజాం రూ. 6.93 కోట్లు, సీడెడ్ రూ. 2.60 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.42 కోట్లు, గుంటూరు రూ. 1.79 కోట్లు, ఈస్ట్ రూ. 2.34 కోట్లు, వెస్ట్ రూ. 1.39 కోట్లు, కృష్ణా రూ. 1.76 కోట్లు, నెల్లూరు రూ. 66 లక్షల షేర్ వసూలైంది.

యూఎస్ఏలో 1 మిలియన్
యూఎస్ఏలో కూడా ‘ఎఫ్ 2' చిత్రానికి అద్భుతమన రెస్పాన్స్ వస్తోంది. తొలి 3 రోజుల్లోనే రూ. 1 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 4.25 అమ్మారు. ఈ మొత్తం ఈజీగా రికవరీ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నమాట.


Click it and Unblock the Notifications











