Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చెర్రీపై వరుణ్ తేజ్ పైచేయి.. వినయ విధేయ రామ కలెక్షన్లు వెలవెల.. ఎఫ్2 కాసుల గలగల..
సంక్రాంతి బరిలో దూకిన మరో తెలుగు చిత్రం ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ తొలి ఆట నుంచే మంచి టాక్‌తో సెన్సేషనల్ హిట్ వైపు దూసుకెళ్తున్నది. వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందించిన చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం పండుగ కానుకగా జనవరి 12న రిలీజైంది. శుక్రవారం రాత్రి అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్లకు భారీ కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. వివరాల్లోకి వెళితే..
ఎఫ్2 ప్రీమియర్లకు భారీ స్పందన
ఎఫ్2 మూవీ అమెరికాలో సుమారు 100కుపైగా సినిమా హాళ్ళలో రిలీజైంది. అడ్వాన్సు బుకింగ్ భారీ స్పందన లభించింది. సంక్రాంతి రేసులో ప్రీమీయర్ షోలకు భారీగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఎఫ్2 ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్నది.
ప్రీమియర్ల కలెక్షన్లు ఇవే
యూఎస్‌లో ప్రదర్శించిన ఎఫ్2 సినిమా కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎఫ్2 చిత్రం 251,263 డాలర్లను వసూలు చేసింది. ఎఫ్2 చిత్రం 107 లోకేషన్లలో ఈ కలెక్షన్లు సాధించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
హిట్ టాక్‌తో ఎఫ్2
సంక్రాంతి రేసులో దిగిన చిత్రాలతో పొల్చితే ఎఫ్2 హిట్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఇటీవల వినయ విధేయ రామ 139 లొకేషన్లలో 181,118 డాలర్లు సాధించింది. రాంచరణ్ సినిమా కంటే వరుణ్ తేజ్ సినిమా కలెక్షన్లు పైచేయి సాధించడం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.
వినయ విధేయ రామ వసూళ్లు వెలవెల
వినయ విధేయ రామ చిత్రం తొలి రోజున సాధించిన వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. జనవరి 11న పేట 225 లొకేషన్లలో 305,335 డాలర్లు, ఎఫ్2 188,424 డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 129 లొకేషన్లలో 66,388 డాలర్లు, విశ్వమ్ 75 లొకేషన్లలో 26,261 డాలర్లు, వినయ విధేయ రామ 95 లొకేషన్లలో 25,653 డాలర్లు సాధించాయి.