twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F2 కలెక్షన్ల జోరు.. నాన్ బాహుబలి రికార్డు బ్రేక్.. 100 కోట్లకు చేరువలో...

    |

    సంక్రాంతి బరిలో దూకిన F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. సంక్రాంతి అల్లుళ్లు చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల జైతయాత్ర కొనసాగిస్తున్నది. ఇప్పటికే బ్లాక్‌బాస్టర్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధిస్తున్నది. రెండో వారాంతం తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే...

    యూఎస్‌లో నాన్ బాహుబలి రికార్డు

    యూఎస్‌లో నాన్ బాహుబలి రికార్డు

    F2 చిత్రం ఓవర్సీస్‌లో హంగామా చేస్తున్నది. ఈ చిత్రం ఆదివారం రోజున అమెరికాలో భారీ వసూళ్లను సాధించింది. 128 లోకషన్లలో 168,163 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. రెండో ఆదివారం రోజున రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నాన్ బాహుబలి కేటగిరీలో ఓ రికార్డు.

    F2 ఫంక్షన్లో అదరగొట్టిన OLX బామ్మ.. వెంకటేష్ కౌంటర్ అదుర్స్! F2 ఫంక్షన్లో అదరగొట్టిన OLX బామ్మ.. వెంకటేష్ కౌంటర్ అదుర్స్!

     2 మిలియన్ల డాలర్ క్లబ్‌లోకి

    2 మిలియన్ల డాలర్ క్లబ్‌లోకి

    యూఎస్ బాక్సాఫీస్ వద్ద చిత్రం ఇప్పటి వరకు 1,753,104 డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం 2 మిలియన్ల క్లబ్‌కు చేరువైంది. వీక్ డేస్‌లో భారీగా వసూళ్లను రాబట్టడం సినిమాపై ప్రేక్షకుల ఆదరణ చూపుతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పట్లో భారీ చిత్రాల రిలీజ్ లేకపోవడం వల్ల మరింత సానుకూలంగా మారే అవకాశం ఉంది.

    నైజాంలో మరింత నిలుకడగా

    నైజాంలో మరింత నిలుకడగా

    F2 చిత్రం నైజాంలో కలెక్షన్ల సత్తా చాటుతున్నది. రెండో వారాంతం తర్వాత సోమవారం ఈ చిత్రం రూ.90 లక్షలు కలెక్ట్ చేసింది. దాంతో గత పదిరోజుల్లో రూ.16 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాదాపు ఈ సినిమా రూ.20 షేర్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    ఇక F2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఆంధ్రా, తెలంగాణలో రూ.47 కోట్లు షేర్ (గ్రాస్ రూ.70) వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఆంధ్రాలోనే ఈ సినిమా రూ.30 కోట్లకుపైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్టు.

    రూ.100 కోట్ల క్లబ్‌లోకి

    రూ.100 కోట్ల క్లబ్‌లోకి

    గత పది, పదకొండు రోజుల్లో F2 చిత్రం సుమారు రూ.90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతుండటంతో త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.32 కోట్లకు అమ్మడం జరిగింది.

    English summary
    F2 – Fun and Frustration comedy film, produced by Dil Raju on Sri Venkateswara Creations banner and directed by Anil Ravipudi. Starring Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada in the lead roles and music composed by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X