Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
100 కోట్ల F2 కలెక్షన్లు: విజయ్ దేవరకొండ రికార్డుపై గురి.. ఈ వారమే మటాష్!
టాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలతోపాటు సంక్రాంతి బరిలో దూకిన F2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రం అనూహ్యమైన రెస్పాన్స్‌తో సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. మూడో వారంలో కూడా ఈ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం రెండు వారాల్లో భారీ వసూళ్లను సాధించింది. మూడో వారాంతంలో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం గమనార్హం. తమన్నా, మెహ్రీన్ పిర్జాదా నటించిన ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. వివరాల్లోకి వెళితే..
|
వెంకటేష్ కెరీర్లోనే తొలిసారి
F2 మూవీ తొలి ఆట నుంచే భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం మూడో వారాంతంలో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. వెంకటేష్ కెరీర్లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రం రూ.100 కోట్లు సాధించింది. తన సినిమా సాధించిన విజయంపై అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. నాకు, నా యూనిట్‌కు అతిపెద్ద పండుగ లాంటి రోజు. థాంక్యూ అని ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సత్తా
F2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సత్తా చాటుతున్నది. గత రెండువారాల్లో ఈ చిత్రం నైజాంలో రూ.8.14 కోట్లు, సీడెడ్‌లో రూ.6.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.18 కోట్లు, గుంటూరులో రూ.4.35 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.5.95 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.40 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.29 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.60 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్లో కూడా
ఇక ఓవర్సీస్లో కూడా ఎఫ్2 చిత్రం కలెక్షన్ల జోరు తగ్గలేదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.8.20 కోట్ల వసూళ్లను సాధించిది. తెలుగు, ఓవర్సీస్ ప్రాంతాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో మొత్తంగా రూ.4.10 కోట్లు రాబట్టింది. రానున్న రోజుల్లో భారీ సినిమాల రిలీజ్ పెద్దగా లేకపోవడం వల్ల ఎఫ్2 సినిమాకు సానుకూలంగా కనిపిస్తున్నది.
రెండు వారాల్లోనే రూ.100 కోట్లు
ఇక F2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. నికరంగా చూసుకొంటే రూ.60 కోట్ల వరకు వసూలు చేసినట్టు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. టాలీవుడ్లో భారీగా వసూళ్లు సాధించిన టాప్ 15 చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. విజయ దేవరకొండ నటించిన గీతా గోవిందం సాధించిన రికార్డుపై వెంకటేష్, వరుణ్ తేజ్‌లు దృష్టిపెట్టారు.
గీతా గోవిందం మూవీ రికార్డుపై
గత ఏడాది గీతా గోవిందం చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మూడువారాల్లో రూ.68.50 కోట్లు సాధించింది. ఇప్పుడు విజయ దేవరకొండ సాధించిన చిత్రం వసూళ్లపై వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా దృష్టిపెట్టింది. ఈ వారంలో గీతా గోవిందం కలెక్షన్లను ఎఫ్2 దాటే పరిస్థితి కనిపిస్తున్నది.