‘ఎఫ్ 2’ సంచలనం... 3 రోజుల్లోనే 1 మిలియన్!
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'ఎఫ్ 2' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షోలతో కలిపి కేవలం 3 రోజుల్లోనే 1 మిలియన్ మార్కును అందుకుంది.
యూఎస్ఏలో సంక్రాంతి హాలిడేస్ లాంటివి ఏమీ ఉండవు... అయినప్పటికీ మంగళవారం ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. మరో వైపు ఈ సినిమా ద్వారా వెంకీ ఖాతాలో తొలి 1 మిలియన్ మూవీ పడినట్లయింది.

3 రోజుల్లో 1 మిలియన్
‘ఎఫ్ 2' మూవీ ఆదివారం నాటికి టోటల్ $926,566 గ్రాస్ వసూలైంది. సోమవారం $67,079 వసూలు చేయడంతో దాదాపు వన్ మిలియన్‌కు రీచ్ అయింది.

పండగరోజు అదరగొట్టింది
అయితే అమెరికాలో ఎలాంటి సంక్రాంతి హాలిడే లేకున్నా.... వసూళ్లు అదిరిపోయాయి. మంగళవారం $117,674 వసూలు చేసింది. దీంతో టోటల్ వసూళ్లు $1,111,319 రీచ్ అయింది.

సెకండ్ వీకెండ్ 1.5 మిలియన్
సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ‘ఎఫ్ 2' మూవీ 1.5 మిలియన్ మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్‌లో 2 మిలియన్ రీచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎందుకు ఇంత పెద్ద హిట్టు?
తెలుగులో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ డ్రామాకు కామెడీ జోడించి కుటుంబ సమేతంగా ప్రేక్షులను అలరించే సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత ఒక హెల్దీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ రావడం... వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం ప్రేక్షకులను మెప్పించింది.


Click it and Unblock the Notifications











