twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో రికార్డు బద్దలు... 15 రోజుల్లో ‘ఎఫ్ 2’ షేర్, లాభాల వివరాలు ఇవే!

    |

    వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటపండిస్తోంది. 2 వారాల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ కామెడీ ఎంటర్టెనర్ బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.

    శనివారంతో 'ఎఫ్ 2' వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద 15 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 3.50 కోట్ల సాధించడంతో టోటల్ షేర్ రూ. 68.80 కోట్లకు చేరుకుంది. దీంతో 'గీత గోవిందం' లైఫ్ టైమ్ షేర్ రూ. 68.20 కోట్ల రికార్డ్ బద్దలు కొట్టింది.

    70 కోట్ల షేర్ సాధించిన తొలి మీడియం బడ్జెట్ మూవీ

    70 కోట్ల షేర్ సాధించిన తొలి మీడియం బడ్జెట్ మూవీ

    ఆదివారంతో టోటల్ షేర్ రూ. 70 కోట్లకు రీచ్ కానుంది. తెలుగు సినిమా చరిత్రలో మీడియం బడ్జెట్‌లో రూపొంది ఇంత భారీ షేర్ సాధించిన తొలి చిత్రంగా ‘ఎఫ్ 2' సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది.

    100 కోట్లు దాటేసిన ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళు దుమ్ముదులిపేశారు!100 కోట్లు దాటేసిన ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళు దుమ్ముదులిపేశారు!

    15 రోజుల్లో వచ్చిన లాభం ఎంత?

    15 రోజుల్లో వచ్చిన లాభం ఎంత?

    15 రోజుల్లో వచ్చిన లాభాల వివరాల్లోకి వెళితే..... డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి 200 శాతం రికవరీ అయింది. రూ. 34.50 కోట్లుకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు... అన్ని ఖర్చులు పోను రూ. 34 కోట్ల లాభాన్ని తమ పాకెట్లో వేసుకున్నారు.

    ఏరియావైజ్ షేర్

    ఏరియావైజ్ షేర్

    • నైజాంలో రూ. 19.48 కోట్ల షేర్ (పెట్టుబడి రూ. 9 కోట్లు)
    • సీడెడ్లో రూ. 7.20 కోట్ల షేర్ (పెట్టుబడి రూ. 5 కోట్లు)
    • ఆంధ్రాలో రూ. 29.27 కోట్ల షేర్(పెట్టుబడి రూ. 14 కోట్లు)
    • రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.30 కోట్లు (పెట్టుబడి రూ. 2.25 కోట్లు)
    • ఓవర్సీస్ రూ. 8.55 కోట్లు (పెట్టుబడి రూ. 4.25 కోట్లు)
    • ఇంకెన్ని రికార్డులో...

      ఇంకెన్ని రికార్డులో...

      ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 120 కోట్ల మార్కను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దిల్ రాజు బేనర్లో ఈ మూవీ అత్యధిక లాభాల శాతం సాధించిన చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    Venkatesh Daggubati, Varun Tej, Mehreen Kaur Pirzada and Tamannah Bhatia starrer F2 Fun and Frustration has earned Rs 68.80 Cr shares world box office after the successful run of 15 days. The has crossed Geetha Govindam which has collected 68.20 cr share.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X