Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో రికార్డు బద్దలు... 15 రోజుల్లో ‘ఎఫ్ 2’ షేర్, లాభాల వివరాలు ఇవే!
వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటపండిస్తోంది. 2 వారాల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ కామెడీ ఎంటర్టెనర్ బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.
శనివారంతో 'ఎఫ్ 2' వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద 15 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 3.50 కోట్ల సాధించడంతో టోటల్ షేర్ రూ. 68.80 కోట్లకు చేరుకుంది. దీంతో 'గీత గోవిందం' లైఫ్ టైమ్ షేర్ రూ. 68.20 కోట్ల రికార్డ్ బద్దలు కొట్టింది.
70 కోట్ల షేర్ సాధించిన తొలి మీడియం బడ్జెట్ మూవీ
ఆదివారంతో టోటల్ షేర్ రూ. 70 కోట్లకు రీచ్ కానుంది. తెలుగు సినిమా చరిత్రలో మీడియం బడ్జెట్లో రూపొంది ఇంత భారీ షేర్ సాధించిన తొలి చిత్రంగా ‘ఎఫ్ 2' సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది.
100 కోట్లు దాటేసిన ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళు దుమ్ముదులిపేశారు!
15 రోజుల్లో వచ్చిన లాభం ఎంత?
15 రోజుల్లో వచ్చిన లాభాల వివరాల్లోకి వెళితే..... డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి 200 శాతం రికవరీ అయింది. రూ. 34.50 కోట్లుకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు... అన్ని ఖర్చులు పోను రూ. 34 కోట్ల లాభాన్ని తమ పాకెట్లో వేసుకున్నారు.
ఏరియావైజ్ షేర్
- నైజాంలో రూ. 19.48 కోట్ల షేర్ (పెట్టుబడి రూ. 9 కోట్లు)
- సీడెడ్‌లో రూ. 7.20 కోట్ల షేర్ (పెట్టుబడి రూ. 5 కోట్లు)
- ఆంధ్రాలో రూ. 29.27 కోట్ల షేర్(పెట్టుబడి రూ. 14 కోట్లు)
- రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.30 కోట్లు (పెట్టుబడి రూ. 2.25 కోట్లు)
- ఓవర్సీస్ రూ. 8.55 కోట్లు (పెట్టుబడి రూ. 4.25 కోట్లు)
ఇంకెన్ని రికార్డులో...
ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ. 120 కోట్ల మార్కను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దిల్ రాజు బేనర్లో ఈ మూవీ అత్యధిక లాభాల శాతం సాధించిన చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.