‘ఎఫ్ 2’ మూవీ 5 డేస్ కలెక్షన్స్: 92.8 శాతం రివకరీ, ఇక లాభాలే లాభాలు!
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'ఎఫ్ 2' థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తుండటంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బుధవారంతో 5 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కలెక్షన్లు పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో 92.8 శాతం రికవరీ అయింది. నేటితో 100శాతం పెట్టుబడి రికవరీ అవ్వడంతో పాటు ప్రాఫిట్స్ జోన్‌లోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు.

5 రోజుల్లో ఎంత వసూలైంది?
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.03 కోట్ల షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్, వెంకటేష్ మార్కెట్‌తో పోలిస్తే ఇది భారీ మొత్తమే అంటున్నారు.

ఏరియా వైజ్ వివరాలు
నైజాంలో రూ. 8.96 కోట్లు, సీడెడ్ రూ. 3.42, ఉత్తరాంధ్ర రూ. 3.15 కోట్లు, గుంటూరు రూ. 2.33 కోట్లు, ఈస్ట్ రూ. 3.09 కోట్లు, వెస్ట్ రూ. 1.74 కోట్లు, కృష్ణ రూ. 2.30 కోట్లు, నెల్లూరు. రూ. 84 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్ రూ. 4.30 కోట్ల షేర్ రాబట్టింది.

సినిమాను ఎంతకు అమ్మారు?
‘ఎఫ్ 2' థియేట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 34.5 కోట్లకు అమ్మారు. 5 రోజుల్లో రూ. 32.03 రాబట్టడంతో 92.8 శాతం రికవరీ అయినట్లయింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ భారీ లాభాలను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

యూఎస్ఏలో అదరగొడుతోంది
యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సైతం ‘ఎఫ్ 2' మూవీ అదరగొడుతోంది. 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేసిన ఈమూవీ... మంగళవారం నాటికి $1,124,540 రీచ్ అయింది. సెకండ్ ఫస్ట్ వీకెండ్ 1.5 మిలియన్, ఫుల్ రన్‌లో 2 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











