6 డేస్ కలెక్షన్: అక్కడ తప్ప.. అన్నిచోట్లా లాభాల్లో ‘ఎఫ్ 2’

వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' మూవీ బాక్సాఫీసు వద్ద గురువారంతో విజయవంతంగా 6 డేస్ పూర్తి చేసుకుంది. తొలి షో నుంచే సూపర్ హిట్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా లాభాల్లోకి ఎంటరైంది.

కుటుంబ కథా చిత్రం కావడం, ఇంటిల్లిపాది కూర్చుని హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో 'ఎఫ్ 2' చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన స్పందన వస్తోంది. సంక్రాంతి హాలిడే ముగిసిన తర్వాత కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

6 డేస్ కలెక్షన్

6 డేస్ కలెక్షన్

తెలుగు రాష్ట్రాల్లో ‘ఎఫ్ 2' మూవీ 6వ రోజైన గురువారం రూ. 5.21 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో టోటల్ షేర్ రూ. 31.04 కోట్లకు రీచ్ అయింది. సినిమా విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి లాభాల్లోకి ఎంటరైంది.

ఆంధ్రా, నైజాంలో లాభాల్లో...

ఆంధ్రా, నైజాంలో లాభాల్లో...

నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మగా... ఇప్పటి వరకు రూ. 10.58 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఏరియా రైట్స్ రూ. 14 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 16.33 కోట్లు రాబట్టింది.

సీడెడ్ ఏరియాలో తప్ప..

సీడెడ్ ఏరియాలో తప్ప..

అయితే.... సీడెడ్ ఏరియాలో ‘ఎఫ్ 2' మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింటును రీచ్ కాలేదు. ఇక్కడ రైట్స్ రూ. 5 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 4.13 షేర్ మాత్రమే రాబట్టింది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ పాయింటును క్రాస్ చేసి లాభాల్లోకి ఎంటరవుతుందని అంచనా వేస్తున్నారు.

రెస్టాఫ్ ఇండియా..

రెస్టాఫ్ ఇండియా..

‘ఎఫ్ 2' రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 2.25 కోట్లకు అమ్ముడవ్వగా... 5 రోజుల్లో రూ. 1.90 కోట్ల షేర్ రాబట్టింది. 6వ రోజు కలెక్షన్ వివరాలు అందాల్సి ఉంది. అయితే ఇక్కడ సైతం లాభాలు ఖాయమని తేలిపోయింది.

ఓవర్సీస్‌లో లాభాలు

ఓవర్సీస్‌లో లాభాలు

ఓవర్సీస్ బిజినెస్ విషయానికొస్తే.... ఇప్పటికే 1 మిలియన్ మార్కును క్రాస్ చేసి 1.5 మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. రైట్స్ రూ. 4.25 కోట్లకు అమ్మగా... 5వ రోజు వరకు అందిన సమాచారం ప్రకారం 4.30 కోట్ల షేర్ రాబట్టింది ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి ఎంటరైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X