twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎఫ్ 2’ బిజినెస్ క్లోజ్... ఫైనల్ కలెక్షన్స్ ఇవే.. వెంకీ కెరీర్‌లోనే గ్రేట్‌గా!

    |

    వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ 2019లో తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హిట్‌గా నిలిచింది. ఇటీవలే 50 రోజుల వేడుక జరుపుకుంది. వరల్డ్ వైడ్ దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.

    ఈ వారంతో ‘ఎఫ్ 2' బిజినెస్ క్లోజ్

    ఈ వారంతో ‘ఎఫ్ 2' బిజినెస్ క్లోజ్

    ఈ వారంతో ‘ఎఫ్ 2' బిజినెస్ దాదాపు అన్ని ఏరియాల్లో క్లోజ్ కాబోతోంది. సినిమా దాదాపు తెలుగు ప్రేక్షకులు అందరూ చూసేయడం, అమేజాన్ ప్రైవ్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో కూడా అందుబాటులోకి రావడంతో... థియేట్రికల్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. ఈ వీకెండ్‌తో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు అన్ని ఏరియాల నుంచి సినిమాను ఎత్తేయబోతున్నారు.

    ఇప్పటి వరకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఎంత?

    ఇప్పటి వరకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఎంత?

    ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 81.05 కోట్ల షేర్ వసూలైంది. థియేట్రికల్ రైట్స్ రూ. 34.50 కోట్లకు అమ్ముడవ్వగా... అంతకు రెట్టింపు లాభం వసూలు చేసింది. దిల్ రాజు బేనర్లో అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా నిలిచింది.

    మహేష్ హ్యాండిస్తే... ఎన్టీఆర్‌తో చేతులు కలిపిన సుకుమార్... రంగస్థలం తర్వాత దారుణంగా!మహేష్ హ్యాండిస్తే... ఎన్టీఆర్‌తో చేతులు కలిపిన సుకుమార్... రంగస్థలం తర్వాత దారుణంగా!

    మూడు వారాల నుంచి కష్టంగా...

    మూడు వారాల నుంచి కష్టంగా...

    గడిచిన 3 వారాలుగా ‘ఎఫ్ 2' థియేట్రికల్ రన్ కాస్త కష్టంగానే సాగింది. శివరాత్రి, వీకెండ్స్ తప్ప ఆశించిన స్థాయిలో థియేటర్లు నిండలేదు. ఇంకా నడిపిస్తే థియేటర్ల రెంటు మీద పడి నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

    ఏరియా వైజ్ షేర్, లాభం

    ఏరియా వైజ్ షేర్, లాభం

    ఏపీ, తెలంగాణ రైట్స్ రూ. 28 కోట్లుకు అమ్మగా షేర్ రూ. 66.15 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 38 కోట్ల లాభం వచ్చింది. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 2.25 కోట్లు అమ్మగా షేర్ రూ. 5.60 కోట్లు వూలు చేయడంతో రూ. 3.35 కోట్ల లాభం వచ్చింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 4.25 కోట్లకు అమ్మగా రూ. 9.30 కోట్ల షేర్ రాబట్టడంతో రూ. 5.05 కోట్ల లాభం వచ్చింది.

    English summary
    F2 movie business will close this week. The movie worldwide distributor share is 81 Cr. The film is a huge blockbuster as it has done more than double of the valued theatrical rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X