ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘ఎఫ్ 2’ సరికొత్త కలెక్షన్ రికార్డ్
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' బాక్సాఫీసు వద్ద సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
నైజాం ఏరియాలో తెలుగు సినిమాల ప్రదర్శనకు కేంద్ర బిందువైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇక్కడి సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ప్రదర్శితం అవుతున్న ఈ చిత్రం 54 రోజుల్లో రూ. 1 కోటి 20వేలు గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఈ విజయంతో వెంకీ మరోసారి ఫుల్ డిమాండ్ ఉన్న హీరోగా మారిపోయారు. హీరోయిన్లుగా కాస్త వెనకపడిపోయిన తమన్నా, మెహ్రీన్ కూడా ఈ సక్సెస్‍తో మరింత ముందుకు దూసుకెళ్లారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
త్వరలో 'ఎఫ్ 3' మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్2 లో ఇద్దరు హీరోలతోనే ఇంత కామెడీ పండించిన అనిల్ రావిపూడి, ఎఫ్ 3లో మరో హీరోను యాడ్ చేయబోతున్నారు. ఇద్దరు హీరోలతోనే ఇంతగా నవ్వించాడంటే ముగ్గురు హీరోలతో ఎలాంటి రచ్చ చేయిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











