‘ఎఫ్ 2’ థియేటర్లు ప్రేక్షకులతో కళకళ.... 3వ రోజు కలెక్షన్ ఎంతంటే?
2019 సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ విన్నర్ 'ఎఫ్ 2 -ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అని తేలిపోయింది. శనివారం(జనవరి 12)న ఈ చిత్రం విడుదలవ్వగా... తొలి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం, యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా విడుదలైన అన్ని చోట్ల అన్ని షోలు ఆడియన్స్‌తో కళకళలాడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా మార్కెట్లో కూడా ఎఫ్ 2 చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ఏలో సోమవారంతో 1 మిలియన్ గ్రాస్ మార్క్ రీచ్ అయింది. వసూళ్ల వివరాలు కింద విధంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 2 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం(3డేస్) నాటికి ‘ఎఫ్ 2' మూవీ రూ. 14.9 కోట్ల షేర్ వసూలు చేసింది. శని, ఆదివారాల్లో(రూ. 9.2 కోట్లు) కంటే అధికంగా భోగి పండగ రోజైన సోమవారం(రూ. 5.7 కోట్లు) వసూలు చేసింది.

ఎఫ్ 2 యూఎస్ఏలో...
ఎఫ్ 2 మూవీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. శుక్రవారం ప్రీమియర్ షోలతో ఇక్కడ ఈ కామెడీ ఎంటర్టెనర్ బాక్సాఫీసు ప్రభంజనం మొదలైంది. ఆదివారం నాటికి టోటల్ $926,566 గ్రాస్ వసూలైంది. సోమవారం 1 మిలియన్ మార్క్ రీచ్ అయింది. ఆదివారం 111 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $271,784 వసూలు చేయడం ద్వారా ఒక్కో లొకేషన్లో $2,449 యావరేజ్ సాధించింది.

ఎన్టీఆర్ కథానాయకుడు
ఎన్టీఆర్-కథానాయకుడు జనవరి 8న ప్రీమియర్ షోలతో యూఎస్ఏలో బాక్సాఫీసు ప్రయాణం మొదలు పెట్టింది. ఆదివారం నాటికి ఈ చిత్రం టోటల్ గ్రాస్ $862,793 రీచ్ అయింది. ఆదివారం 150 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $47,332 వసూలు చేసింది. లొకేషన్ యావరేజ్ కేవలం $316 మాత్రమే ఉండటం గమనార్హం.

నిరాశ పరిచిన ‘వినయ విధేయ రామ’
‘వినయ విధేయ రామ' మూవీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. జనవరి 10న యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ప్రీమియర్ షోలతో ఈ మూవీ మొదలవ్వగా...ఆదివారం నాటికి టోటల్ గ్రాస్ కేవలం $241,721 వసూలు చేసింది. ఆదివారం 76 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $8,140 రాబట్టింది. అంటే లొకేషన్ యావరేజ్ $107 మాత్రమే.


Click it and Unblock the Notifications











