F3 11 Days Collections: ఎఫ్3 కలెక్షన్స్ లో భారీ డ్రాప్.. ఇన్ని రోజుల్లో ఇదే మొదటిసారి!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'F2' సూపర్ హిట్ గా నిలవడంతో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని ప్రకటించారు. ప్రకటించినట్టుగానే ఆ సినిమాకి సీక్వెల్‌గా F3 అనే మూవీని రూపొందించారు. హిట్ కాంబినేషన్‌ కావడంతో ఆరంభంలోనే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే భారీ అంచనాలతో మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చడంతో మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'F3'. ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించారు. సునీల్, సోనాల్ చౌహాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పూజ హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకొని రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

భారీగా డ్రాప్

భారీగా డ్రాప్

'ఎఫ్ 3'కు 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 54 లక్షల షేర్ రాబట్టింది.

11 రోజులకు భారీగానే

11 రోజులకు భారీగానే

'ఎఫ్ 3'కి 11 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.72 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.25 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.37 కోట్లు, గుంటూరులో రూ. 3.14 కోట్లు, కృష్ణాలో రూ. 2.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.71 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 42.35 కోట్లు షేర్, రూ. 68.15 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో

ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో

ఆంధ్ర, తెలంగాణలో సత్తా చాటిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 11 రోజులకు రూ. 42.35 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.98 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే ఈ మూవీ రూ. 52.21 కోట్లు షేర్, రూ. 87.51 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇంకా ఎన్ని కోట్లు సాధించాలంటే?

ఇంకా ఎన్ని కోట్లు సాధించాలంటే?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 3' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.21 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 12.29 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X