F3 13 Days Collections: ఎఫ్‌3 భారీ దెబ్బ.. 13వ రోజు ఘోరంగా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో హీరోల అభిమానులు మధ్య సత్సంబంధాలు ఏర్పడడంతో పాటు ఎన్నో హిట్లు బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. ఇలా ఆ మధ్య విడుదలైన మల్టీస్టారర్ చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా F3 మూవీని రూపొందించారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ దక్కడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఈ మూవీ కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు F3 మూవీ 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

వెంకీ, వరుణ్ కాంబోలో వచ్చేసింది

వెంకీ, వరుణ్ కాంబోలో వచ్చేసింది

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన మరో మల్టీస్టారర్ మూవీనే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

అటు వెంకీకి, ఇటు వరుణ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు F2 వంటి భారీ హిట్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఎఫ్3' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయింది.

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది


'ఎఫ్ 3' మూవీకి ఆరంభంలో మంచి టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో చాలా ఏరియాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, దీనికి క్రమంగా ఆదరణ తగ్గడంతో వసూలు పడిపోతున్నాయి. ఇక, ఈ చిత్రానికి 12వ రోజులు ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 30 లక్షలు కలెక్ట్ అవగా... 13వ రోజు మాత్రం కాస్త తగ్గి రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయి.

13 రోజులకు కలిపి ఎంత వచ్చింది

13 రోజులకు కలిపి ఎంత వచ్చింది

13 రోజులకు కలిపి 'ఎఫ్ 3'కి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.79 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.30 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.40 కోట్లు, గుంటూరులో రూ. 3.19 కోట్లు, కృష్ణాలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 1.73 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 42.85 కోట్లు షేర్, రూ. 69 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 13 రోజులకు రూ. 42.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.91 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.02 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లోనే ఈ మూవీ రూ. 52.78 కోట్లు షేర్, రూ. 88.46 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.78 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 11.72 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X